
Kingdom : వాయిదాలకు గుడ్‌బై..! ఎట్టకేలకు 'కింగ్డమ్' రిలీజ్ డేట్ లాక్
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా 'కింగ్డమ్' మరో కీలక దశలోకి అడుగుపెట్టింది. 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్టులో విజయ్ ఓ ఇంటెన్స్ యాక్షన్ రోల్‌లో కనిపించనున్నాడు. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, గ్లింప్సెస్ చూసిన ప్రతి ఒక్కరికీ ఆయనలో కొత్త యాంగిల్ కనబడిందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పాత్ర కోసం విజయ్ దేవరకొండ తన లుక్ నంతా మర్చేశాడు. గత ప్రాజెక్టులతో పోలిస్తే, ఈ సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ మరింత పవర్‌ఫుల్‌గా ఉంటుందనే టాక్ స్పష్టంగా వినిపిస్తోంది.
Details
ననహీరోయిన్‌గా భాగ్యశ్రీ బొర్సె
హీరోయిన్‌గా భాగ్యశ్రీ బొర్సె నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇటీవలి వరకు వరుసగా వాయిదాలు పడుతూ వచ్చిన 'కింగ్డమ్' చిత్రానికి ఎట్టకేలకు విడుదల తేదీ ఖరారైనట్లు సమాచారం. ఇదే విషయాన్ని తాజాగా మేకర్స్ ఒక ఆసక్తికర అప్డేట్ ద్వారా బయటపెట్టారు. సినిమా రిలీజ్ డేట్ ప్రోమోను ఈ రోజు సాయంత్రం 7:03 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో గతంలో వాయిదాల వల్ల నిరాశ చెందిన ఫ్యాన్స్‌కి మళ్లీ ఆసక్తి పెరిగింది. విడుదల తేదీ విషయంలో ఇక తుది క్లారిటీ రానుండటంతో ప్రేక్షకుల్లో మరోసారి కొత్త ఉత్సాహం నెలకొంది.