Page Loader
Vijay Deverakonda: కింగ్‌డమ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ రోజున విజయ్ దేవరకొండ మాస్ ఎంట్రీ!
కింగ్‌డమ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ రోజున విజయ్ దేవరకొండ మాస్ ఎంట్రీ!

Vijay Deverakonda: కింగ్‌డమ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ రోజున విజయ్ దేవరకొండ మాస్ ఎంట్రీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 18, 2025
04:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

విజయ్ దేవరకొండ కెరీర్‌లో అత్యంత కీలకమైన చిత్రంగా భావిస్తున్నా 'కింగ్‌డమ్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో 'లైగర్', 'ఫ్యామిలీ స్టార్' వంటి నిరాశాజనక ఫలితాల వల్ల విజయ్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో తన కెరీర్‌ను తిరిగి నిలబెట్టుకోవాలన్న ఆశతో విజయ్ దేవరకొండ ఈ ప్రాజెక్ట్‌కు భారీ ఆశలు పెట్టుకున్నాడు. 'కింగ్‌డమ్' చిత్రానికి 'జెర్సీ' వంటి హిట్‌ను అందించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాణ బాధ్యతలు సితార ఎంటర్టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ చేపట్టాయి. ఇది విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం కావడం విశేషం.

Details

జూలై 25న రిలీజ్

ఇప్పటికే విడుదలైన టీజర్‌కు విశేష స్పందన లభించింది. విజువల్స్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌, విజయ్ లుక్‌ ఈ చిత్రంపై మంచి పాజిటివ్ బజ్ తెచ్చాయి. కానీ టీజర్ తర్వాత చిత్ర బృందం నుంచి మరో ప్రమోషనల్ కంటెంట్ రాలేదు. పాటలు, ట్రైలర్, మీడియా ఈవెంట్లపై ఎలాంటి అప్‌డేట్‌లు లేకపోవడంతో, సినిమా ముందడుగు వెనకడుగు విషయంలో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం 'కింగ్‌డమ్' సినిమా 2025 జూలై 25వ తేదీన శుక్రవారం విడుదల కానుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయమై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

Details

ఈ మూవీపై భారీ అంచనాలు

అయినా కూడా మేకర్స్ ఆ తేదీకే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలున్నాయి. సాధారణంగా ఇలాంటి బడ్జెట్ చిత్రాలకు రిలీజ్‌కు రెండు నెలల ముందే ప్రమోషన్లు ప్రారంభమవుతాయి. కానీ ఇప్పటికీ చిత్రయూనిట్ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడం ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. విజయ్ దేవరకొండ మళ్లీ ట్రాక్‌లోకి రావాలంటే ఈ సినిమా విజయవంతం కావడం కీలకం. మరి అభిమానుల అంచనాలకు ఈ చిత్రం ఎంతమేర అలరిస్తుందో వేచి చూడాలి.