Page Loader
Kingdom :'కింగ్‌డమ్' చిత్రంలో బ్రదర్ సెంటిమెంట్.. రెండవ సింగిల్ సాంగ్‌పై తాజా అప్డేట్ ఇదే! 
'కింగ్‌డమ్' చిత్రంలో బ్రదర్ సెంటిమెంట్.. రెండవ సింగిల్ సాంగ్‌పై తాజా అప్డేట్ ఇదే!

Kingdom :'కింగ్‌డమ్' చిత్రంలో బ్రదర్ సెంటిమెంట్.. రెండవ సింగిల్ సాంగ్‌పై తాజా అప్డేట్ ఇదే! 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 14, 2025
12:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'కింగ్‌డమ్'. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఇప్పటికే విడుదలైన ప్రచార పత్రికలు, పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో సినిమా పట్ల ఉన్న ఆసక్తి, క్రేజ్ మరింత పెరుగుతోంది. ఇందులో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బొర్సె నటించనుండగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జూలై 31న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మరోవైపు, ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. దీంతో పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

వివరాలు 

 జూలై 15వ తేదీన పాట ప్రోమో విడుదల

తాజాగా చిత్ర బృందం మరో ఆసక్తికరమైన అప్డేట్‌ను షేర్ చేసింది. ఈ సినిమాలో రెండవ సింగిల్‌గా 'అన్న అంటేనే..' అనే భావోద్వేగపూరితమైన పాటను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అన్నా-తమ్ముల అనుబంధాన్ని హృదయాన్ని తాకేలా ఈ గీతంలో చూపించనున్నారని తెలిపారు. మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌లో చిన్నతనంలో విజయ్ దేవరకొండ తన సోదరుడితో కలిసి దిగిన ఓ స్మారక ఫోటోను వాడారు. ఈ పోస్టర్ చూసిన అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు. ఇక ఈ సినిమాలో హీరో సోదరుడి పాత్రలో ప్రముఖ నటుడు సత్యదేవ్ నటిస్తున్నట్టు సమాచారం. ఇక ఈ పాట ప్రోమోను జూలై 15వ తేదీన సాయంత్రం 5:05 గంటలకు విడుదల చేయనున్నట్టు మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్