
VD 12 : కింగ్‌డమ్ స్టోరీ.. అసలైన ఇన్ సైడ్ టాక్ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం 'కింగ్‌డమ్'. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నిర్మాతలుగా సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య వ్యవహరిస్తున్నారు. మొదట మే 30న విడుదల కావలసిన ఈ చిత్రం, షూటింగ్ డిలే కారణంగా జూన్ 31న వరల్డ్ వైడ్ థియేటర్లలోకి రానుంది. తాజాగా విడుదలైన 'కింగ్‌డమ్' ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రం ద్వారా విజయ్ దేవరకొండ మరో విజయాన్ని ఖాతాలో వేసుకోనున్నాడన్న అంచనాలు నెలకొన్నాయి.
Details
కానిస్టేబుల్ పాత్రలో విజయ్ దేవరకొండ
కథ విషయానికొస్తే- కథానాయకుడు ఒక కానిస్టేబుల్‌గా పని చేస్తూ, అండర్‌కవర్ ఆఫీసర్‌గా ఓ ఆపరేషన్‌లో పాల్గొంటాడు. ఆపరేషన్ నేపథ్యంలో ప్రయాణించే వ్యక్తుల మధ్య నడిచే కథలో, చివరికి అతను ఎందుకు విలన్ల తరఫున నిలవాల్సి వచ్చిందో, అలాగే ఇద్దరు అన్నదమ్ములు ఎందుకు శత్రువులుగా మారారన్న ఆసక్తికర అంశాలు ఉంటాయని సమాచారం. ఇంతకీ కథ సెకండాఫ్‌లో ఓ భారీ టర్న్ తీసుకోనుందని, ఇందులో పునర్జన్మ కాన్సెప్ట్‌ను స్పృశించేలా 'యుగానికి ఒక్కడు' తరహాలో మలిచారని టాక్. ఈ ఎపిసోడ్స్‌కు అనిరుధ్ రవిచంద్రన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అత్యంత పవర్‌ఫుల్‌గా ఉండనుందని తెలుస్తోంది.
Details
యాక్షన్ సీక్వెన్స్ లు హైలైట్ గా ఉండే అవకాశం
అలాగే యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా చిత్రానికి హైలైట్‌గా నిలవనున్నాయి. మొత్తంగా చూస్తే 'కింగ్‌డమ్' సినిమా విజయ్ దేవరకొండ అభిమానులకు విజువల్ ఫీస్‌గా ఉండబోతుందని ట్రేడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. విజయ్‌కు ఈ సినిమా హిట్‌ను అందిస్తుందా లేక మళ్లీ ప్లాప్‌గా నిలుస్తుందా అన్నది మరో మూడు రోజుల్లో తేలనుంది.