Loading...
KA 13 : క్రిస్మస్‌ రేసులో కిరణ్ అబ్బవరం.. 'రియాలిటీ' రిలీజ్ డేట్‌ వచ్చేసింది!

KA 13 : క్రిస్మస్‌ రేసులో కిరణ్ అబ్బవరం.. 'రియాలిటీ' రిలీజ్ డేట్‌ వచ్చేసింది!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 05, 2026
01:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం జెట్‌ స్పీడ్‌తో దూసుకెళ్తున్నారు. ఓ వైపు నటుడిగా, మరోవైపు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆయన.. ఇప్పుడు దర్శకుడిగానూ మారారు. హీరోగా తన కెరీర్‌లో 13వ సినిమాగా తెరకెక్కుతున్న చిత్రానికి కిరణ్ అబ్బవరం స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు 'రియాలిటీ' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను చిత్ర బృందం అధికారికంగా విడుదల చేసింది. ఈ గ్లింప్స్‌ను పరిశీలిస్తే.. సినిమా కాన్సెప్ట్‌ ఓరియెంటెడ్‌గా, హార్ట్‌ టచింగ్‌గా, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

వివరాలు

అధికారికంగా ప్రకటన

టైటిల్ గ్లింప్స్‌ ద్వారా మేకర్స్ సినిమా విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు. క్రిస్మస్‌ రేసులో నిలిచిన ఈ సినిమాను డిసెంబర్‌ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కన్ఫర్మ్‌ చేసింది.

మరోవైపు డిసెంబర్‌ 24న నందమూరి బాలకృష్ణ నటించిన 'దాదా'తో పాటు కింగ్ నాగార్జున నటిస్తున్న 'కింగ్ 100' కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

దీంతో క్రిస్మస్‌ సందర్భంగా బాక్సాఫీస్‌ వద్ద సినిమాల మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉంది.

ఓవర్సీస్‌లో డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న సుధాకర్‌ చాగంటి.. 'రియాలిటీ' సినిమాతో నిర్మాతగా మారుతున్నారు. 'జాయ్‌ ఫిల్మ్స్‌' బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

వివరాలు

దర్శకుడిగా ఎలా రాణిస్తారో చూడాలి

భీమ్స్‌ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం 'రియాలిటీ' సినిమా షూటింగ్‌ దశలో ఉంది.

నటుడిగా, నిర్మాతగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన కిరణ్‌ అబ్బవరం.. ఇప్పుడు దర్శకుడిగా ఎలాంటి మ్యాజిక్‌ చేస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ADVERTISEMENT