LOADING...
K RAMP : దీపావళికి హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం.. మూడ్రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సక్సెస్
దీపావళికి హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం.. మూడ్రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సక్సెస్

K RAMP : దీపావళికి హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం.. మూడ్రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సక్సెస్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 21, 2025
12:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

గత ఏడాదిలో 'క' సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించి క్రేజ్ పొందిన యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం, ఈ దీపావళి పండుగ కోసం మరో యూత్‌ఫుల్ చిత్రం 'KRAMP'తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దీపావళి రేస్‌లో మరో మూడు పెద్ద సినిమాలు విడుదలయ్యాయి, అయినప్పటికీ కిరణ్ అబ్బవరం ఈ సినిమా ద్వారా సాలిడ్ హిట్ కొట్టాడు. కిరణ్ కెరీర్‌లో 11వ చిత్రం ఈ KRAMP. ఇందులో మలయాళ బ్యూటీ 'యుక్తి తరేజా' హీరోయిన్‌గా నటించగా జైన్స్ నాని దర్శకుడిగా ఉన్నారు. హాస్య మూవీస్ బ్యానర్‌లో 7వ సినిమాగా విడుదలైన KRAMP, తొలి రోజు రూ. 4.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో మంచి ప్రారంభం సాధించింది.

Details

ప్రాఫిట్ జోన్ లోకి KRAMP

రెండవ రోజు రెవెన్యూ ఇంకా పెరగడంతో వరల్డ్ వైడ్‌గా రూ. 11.3 కోట్లు సంపాదించింది. దీపావళి వీకెండ్‌లో అనేక థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు ఏర్పడాయి. విడుదలైన మూడు రోజులలోనే రూ. 17.5 కోట్లు సంపాదించి, కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను సాధించింది. నేటి నుండి ఈ సినిమా అన్ని ఏరియాలలో ప్రాఫిట్ జోన్‌లోకి ఎంటర్ అవుతోంది. హీరో కిరణ్ అబ్బవరం, నిర్మాత రాజేష్ దండా మొదట నుంచే ఈ సినిమాను కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం తీశామని చెప్పారు. ఆడియెన్స్‌ను పూర్తి స్థాయిలో ఎంటర్టైన్ చేయడంలో KRAMP సూపర్ సక్సెస్ అయ్యింది.