NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / అటు ఒక సినిమా రిలీజ్ పెట్టుకుని ఇటు సినిమా లాంఛ్ చేసిన కిరణ్ అబ్బవరం
    తదుపరి వార్తా కథనం
    అటు ఒక సినిమా రిలీజ్ పెట్టుకుని ఇటు సినిమా లాంఛ్ చేసిన కిరణ్ అబ్బవరం
    కిరణ్ అబ్బవరం కొత్త సినిమా లాంఛ్

    అటు ఒక సినిమా రిలీజ్ పెట్టుకుని ఇటు సినిమా లాంఛ్ చేసిన కిరణ్ అబ్బవరం

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 09, 2023
    05:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, ప్రేక్షకుల మీద దండయాత్ర చేయడానికి సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. ఇటీవల వినరో భాగ్యము విష్ణుకథ సినిమాతో యావరేజ్ విజయం అందుకున్న ఈ యంగ్ హీరో, ఇప్పుడు మీటర్ అంటూ మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

    ఏప్రిల్ 7వ తేదీన మీటర్ మూవీ రిలీజ్ కాబోతుంది. అదలా ఉంటే, ఇప్పుడు మరొక కొత్త సినిమాను ప్రారంభించాడు కిరణ్ అబ్బవరం.

    శివమ్ సెల్యులాయిడ్ బ్యానర్ లో రొమాంటిక్ డ్రామాగా రూపొందే సినిమాలో కిరణ్ నటిస్తున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు, రామా నాయుడు స్టూడియోలో పూర్తయ్యాయి.

    దర్శకుడు వివి వినాయక్, సౌండ్ క్లాప్ ఇవ్వగా, నిర్మాతలు దగ్గుబాటి సురేష్ బాబు, ఏఎమ్ రత్నం కెమెరా ఆన్ చేసారు.

    కిరణ్ అబ్బవరం

    ఆభిమానులు ఆపమంటుంటే కిరణ్ ఆపనంటున్నాడు

    కొత్త దర్శకుడు విశ్వ కరుణ్ ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. ఇందులో కిరణ్ అబ్బవరం జోడీగా ఎవరు నటిస్తున్నారనేది ఇంకా ప్రకటించలేదు. ఈ నెల చివర్లో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు.

    కిరణ్ అబ్బవరం వరుస పెట్టి సినిమాలు చేస్తుండడం, అవి బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆడకపోతుండడంతో కొంత గ్యాప్ తీసుకోవాలని హీరో కిరణ్ కు అభిమానుల నుండి సలహాలు అందుతున్నాయి.

    అయినా కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతూనే ఉన్నాడు కిరణ్ అబ్బవరం. ఇప్పటివరకు కిరణ్ తీసిన చిత్రాల్లో ఎస్ ఆర్ కళ్యాణ మండపం తప్ప మిగతావేవీ పెద్దగా ఆడినట్లు దాఖలాలు లేవు. మరి ఇప్పుడు చేస్తున్న చిత్రాలతోనైనా మంచి హిట్ అందుకుంటాడేమో చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా

    తాజా

    Iran: ఇరాన్‌లో తప్పిపోయిన ముగ్గురు భారతీయులు క్షేమం.. రాయబార కార్యాలయం వెల్లడి  ఇరాన్
    AAP: తరగతి గదుల నిర్మాణాల్లో అవినీతి.. మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లకు సమన్లు మనీష్ సిసోడియా
    Elon Musk: 'నన్ను క్షమించండి. నేను ఇంతకంటే భరించలేను'..ట్యాక్స్‌ బిల్లుకు వ్యతిరేకంగా మస్క్ గళం ఎలాన్ మస్క్
    Trump Traiffs:నేటి నుంచి స్టీల్,అల్యూమినియం దిగుమతులపై సుంకాలు 50%కి పెంపు .. ఉత్తర్వులపై ట్రంప్‌ సంతకం   డొనాల్డ్ ట్రంప్

    తెలుగు సినిమా

    సార్ మూవీ: హృతిక్ రోషన్ సూపర్ 30తో పోలికపై దర్శకుడు క్లారిటీ సినిమా
    నేనెప్పుడూ చేయనిది, మీరెప్పుడూ చూడనిది కనిపించే సమయం వచ్చేసిందంటున్న అల్లరి నరేష్ సినిమా
    పరేషాన్ టీజర్ టాక్: మనిషికి నీళ్ళు, అన్నం ఎట్లనో మందు కూడా గట్లనే ట్రైలర్ టాక్
    దసరా ప్రమోషన్లు: చరిత్రలో మొదటిసారిగా 39సెంటర్లలో కౌండ్ డౌన్ బోర్డ్స్ సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025