వినరో భాగ్యము విష్ణుకథ వర్సెస్ శ్రీదేవి శోభన్ బాబు: చిన్న హీరోలు, పెద్ద నిర్మాతలు, కానీ తేడా అదే
మహాశివరాత్రి సందర్భంగా తెలుగు బాక్సాఫీసు వద్ద సినిమాల సందడి ఎక్కువగానే ఉంది. ఈరోజు ధనుష్ నటించిన సార్ మూవీ రిలీజై పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అదలా ఉంచితే, శివరాత్రి రోజున రెండు చిన్న హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒకటి కిరణ్ అబ్బవరం నటించిన వినరో భాగ్యము విష్ణుకథ, రెండోది సంతోష్ శోభన్ హీరోగా వస్తున్న శ్రీదేవి శోభన్ బాబు. ఈ రెండు సినిమాలకు రెండు పోలికలున్నాయి. ఒకటి: రెండు సినిమాల్లోనూ చిన్న హీరోలే, రెండు: ఆ రెండు సినిమాలకు పెద్ద నిర్మాతలే ఉండడం. కాకపోతే రెండింటికీ ఒక్కటే తేడా.. అదే ప్రమోషన్. వినరో భాగ్యము విష్ణుకథ సినిమాను జీఏ2 పిక్చర్స్ నిర్మించింది. అందువల్ల ఈ సినిమాకు మంచి ప్రచారం దొరికింది.
శ్రీదేవి శోభన్ బాబు సినిమాకు నిర్మాతగా ఉన్న చిరంజీవి కూతురు
శ్రీదేవి శోభన్ బాబు సినిమాకు చిరంజీవి కూతురు సుష్మిత కొణిదెల నిర్మాతగా ఉన్నారు. గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న మొదటి చిత్రం ఇది. అయినా కూడా ఈ సినిమాకు సరైన ప్రచారం రాలేదు. దానికి కారణమేంటనేది తెలియదు కానీ, ఇటీవల సంతోష్ శోభన్ వరుసగా ఫ్లాపులు ఎదుర్కొంటున్నాడు. సంక్రాంతికి రిలీజైన కళ్యాణం కమనీయం కూడా బాక్సాఫీసు వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. కేవలం నెల గ్యాప్ లో వస్తున్న శ్రీదేవి శోభన్ బాబు సినిమా సంతోష్ కి హిట్ అందిస్తుందేమో చూడాలి. గౌరీ జి కిషన్ హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు. సంగీతం కామ్రాన్ అందించాడు.