
వినరో భాగ్యము విష్ణుకథ: అన్నమయ్య 12వ తరం వారితో తిరుపతి పాట లాంచ్
ఈ వార్తాకథనం ఏంటి
ఫిబ్రవరి నెలలో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాల్లో అందరికీ ఆసక్తి కలిగిస్తున్న చిత్రం వినరో భాగ్యము విష్ణుకథ అనే చెప్పాలి. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న ఈ సినిమాలో కాశ్మీరా పరదేశి హీరోయిన్ గా కనిపిస్తుంది.
ట్రైలర్ ఆకర్షణీయంగా ఉండడం, పాటలు ఆహ్లాదంగా అనిపించడం సహా, ఫోన్ నంబర్ నైబర్ అనే కొత్త కాన్సెప్ట్ తో వస్తుండడంతో సినిమా మీద ఆసక్తి కలిగింది.
నిన్నటికి నిన్న ఈ మూవీ ఆడియో లాంచ్ జరిగింది. సినిమా కథ తిరుపతిలో జరుగుతుంది కాబట్టి ఆడియో లాంచ్ ఈవెంట్ ని తిరుపతిలో చేసారు. సినిమాలోని ప్రధాన పాటను అన్నమయ్య వారసుల చేత లాంచ్ చేయించారు.
వినరో భాగ్యము విష్ణుకథ
12వ తరం అన్నమయ్య వారసుల చేత పాట లాంచింగ్ ప్రోగ్రామ్
తిరుపతి విశిష్టతను తెలియజేసే ఈ పాటను సోల్ ఆఫ్ తిరుపతి పేరుతో లాంచ్ చేసారు.
ఆంధ్రకవితా పితామహుడిగా పేరు పొందిన తాళ్ళపాక అన్నమాచార్యుల వారి 12తరం ఫ్యామిలీతో తిరుపతి విశిష్టతను తెలియజేసే పాటను లాంచ్ చేయించారు.
ఈ పాటకు సంగీతాన్ని చైతన్ భరద్వాజ్ సమకూర్చగా, సాహిత్యాన్ని కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని అందించారు. పాట ఆద్యంతం మనోహరంగా ఉంది. అనురాగ్ కులకర్ణి గొంతులో మధురంగా వినిపించింది.
అల్లు అరవింద్ సమర్పకులుగా ఉన్న ఈ చిత్రాన్ని జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీవాసు నిర్మిస్తున్నారు. కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 18వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది.
మరి ఈ సినిమా విజయం అందుకుంటుందో లేదో చుడాలి.