సార్ మూవీ ట్విట్టర్ రివ్యూ: యెస్ సార్ అనేస్తున్నారు
హీరో ధనుష్, సార్ సినిమాతో తెలుగులోకి వచ్చేసాడు. సినిమా రిలీజ్ కి ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోలతో పలకరించాడు. ఈ ప్రీమియర్ షోస్ కి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ప్రీమియర్ షోస్ నుండి టాక్ బయటకు వచ్చేసింది. అలాగే సినిమా చూస్తున్న వాళ్ళందరూ ట్విట్టర్ వేదికగా రివ్యూస్ ఇచ్చేస్తున్నారు. వాటి ప్రకారం చూస్తే, చాలామంది సార్ సినిమాకు పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. సినిమా మొదటి భాగం హాయిగా గడిచిపోయిందనీ, డీసెంట్ గా ఉందనీ, విద్యావ్యవస్థ గురించి ధనుష్ పలికిన డైలాగులు అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. 1990ల కాల నాటి పరిస్థితులను, మధ్యతరగతి జీవితాలను చక్కగా చూపించినట్లు చెబుతున్నారు.
ఎమోషన్స్ తో అలరించిన సెకండాఫ్
సెకండాఫ్ లో ఎమోషన్ల్ సీన్లు కళ్ళలో నీళ్ళు తిరిగేలా చేస్తాయని, జీవీ ప్రకాష్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు వెన్నెముక అని కామెంట్లు పెడుతున్నారు. సినిమా మొత్తంలో ధనుష్ నటన, సింపుల్ గా, పాత్రకు తగినట్టుగా కనబడిందనీ, మిగతా నటీనటుల్లో సంయుక్తమీనన్ అందంగా ఉందనీ, విలన్ గా సముద్రఖని మెప్పించారని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారు. ఇక సినిమాలోని నెగెటివ్ పాయింట్స్ మాట్లాడుకోవాలంటే, ఫస్టాఫ్ కొద్దిగా నెమ్మదిగా సాగుతుందనీ, కొన్నిచోట్ల మాటలు డైలాగుల్లా కాకుండా ఉపన్యాసం ఇచ్చినట్లుగా ఉన్నాయని, కానీ అవేమీ పెద్దగా మైనస్ లుగా అనిపించవనీ, తెలుగు ప్రేక్షకుల నుండి ధనుష్ కి మంచి స్వాగతం లభించిందనీ చెబుతున్నారు. మొత్తానికి తమిళం హీరోతో తెలుగు డైరెక్టర్ మంచి హిట్ కొట్టేసినట్టేనని చెప్తున్నారు.