తమిళ హీరో అజిత్ తండ్రి సుబ్రమణియన్ కన్నుమూత
కోలీవుడ్ హీరో అజిత్ ఇంట విషాదం నెలకొంది. తండ్రి పి. సుబ్రమణియన్ ఈరోజు ఉదయం హఠాత్తుగా కన్నుమూసారు. 86ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యల కారణంగా స్వర్గస్తులయ్యారు. ఈరోజు ఉదయం 10గంటలకు చెన్నైలోని బీసెంట్ నాగా స్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని కొలీవుడ్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. కేరళలోని పాలక్కడ్ ప్రాంతానికి చెందిన సుబ్రమణియన్, కలకత్తాకు చెందిన మోహినిని పెళ్ళి చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమారులు. 1971లో రెండవ కుమారుడు అజిత్ జన్మించారు. మిగతా ఇద్దరు కుమారులు అనుప్ కుమార్, వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు. మరో కుమారుడు అనిల్ కుమార్ మద్రాస్ ఐఐటీ లో పట్టా అందుకుని ఆ తర్వాత సొంతంగా కంపెనీ స్థాపించారు.