Loading...
Vismaya Mohanlal: 'కొత్తలోక' రికార్డు బద్దలు.. మోహన్‌లాల్‌ కుమార్తె సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్
'కొత్తలోక' రికార్డు బద్దలు.. మోహన్‌లాల్‌ కుమార్తె సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్

Vismaya Mohanlal: 'కొత్తలోక' రికార్డు బద్దలు.. మోహన్‌లాల్‌ కుమార్తె సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 11, 2026
10:36 am

ఈ వార్తాకథనం ఏంటి

మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ కుమార్తె విస్మయ మోహన్‌ లాల్‌ సినీ రంగ ప్రవేశం ఘనంగా జరిగింది. జూడ్‌ ఆంటోనీ జోసెఫ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ యాక్షన్‌ థ్రిల్లర్‌ 'తుడక్కం'తో ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. విడుదలైన తొలి రోజే ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రికార్డు వసూళ్లు సాధిస్తూ దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఓపెనింగ్స్‌ సాధించిన మహిళా ప్రాధాన్యమున్న మలయాళ చిత్రంగా 'తుడక్కం' నిలిచింది. బాక్సాఫీస్‌ నివేదికల ప్రకారం.. 'తుడక్కం' ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.6.8 కోట్ల వసూళ్లు రాబట్టింది. భారత్‌లో సుమారు 1100 థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేశారు. ఓవర్సీస్‌లోనూ చిత్రానికి మంచి స్పందన లభించడంతో తొలి రోజే రికార్డు స్థాయి కలెక్షన్లు నమోదయ్యాయి.

వివరాలు

తొలి రోజే రూ.6. 63 కోట్ల వసూలు

భారతదేశంలో మొదటి రోజు రూ.2.55 కోట్ల వసూళ్లు సాధించింది. ఇప్పటివరకు కల్యాణి ప్రియదర్శన్‌ నటించిన 'కొత్తలోక' చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.6.63 కోట్ల వసూళ్లతో మహిళా ప్రాధాన్యమున్న మలయాళ చిత్రాల్లో అత్యధిక ఓపెనింగ్‌ సాధించిన సినిమాగా నిలిచింది.

అయితే 'తుడక్కం' రూ.6.8 కోట్లతో ఆ రికార్డును అధిగమించింది. విస్మయ మోహన్‌లాల్‌తో పాటు ప్రముఖ నిర్మాత ఆంటోనీ పెరుంబావూర్‌ కుమారుడు ఆశిష్‌ జోస్‌ ఆంటోనీకి కూడా 'తుడక్కం' తొలి చిత్రమే. సినిమాలో 'మీను' పాత్రలో విస్మయ ఎంతో సహజంగా నటించి ఆకట్టుకున్నారు.

మరోవైపు ఆశిష్‌ సైకో పాత్రలో తన నటనతో ప్రేక్షకులను భయపెట్టారు.

వివరాలు

తొలి సినిమాతోనే రికార్డు

సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులు, లైంగిక దాడులు, వాటి నుంచి బయటపడుతూ మనుగడ కోసం ఓ యువతి చేసే పోరాటం ప్రధానాంశాలుగా ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ తెరకెక్కింది.

కథలో కీలకమైన అతిథి పాత్రలో మోహన్‌లాల్‌ కనిపించి సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

తండ్రి మోహన్‌లాల్‌ కుమార్తెగా విస్మయ తొలి సినిమాతోనే రికార్డు సృష్టించడంతో ఈ విజయంపై మలయాళ సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

ADVERTISEMENT