కృష్ణగాడు అంటే ఒక రేంజ్ మూవీ రివ్యూ: మేకలు తోలుకునే అబ్బాయి ప్రేమకథ ఆకట్టుకుందా?
నటీనటులు: రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ , వినయ్ మహదేవన్, రఘు, స్వాతి పొలిచర్ల తదితరులు నిర్మాణం: శ్రీ తేజస్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ దర్శకత్వం: రాజేష్ దొండపాటి సంగీతం: సాబు వర్గీస్ కథ: చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన కృష్ణ(రిష్వి తిమ్మరాజు), తన ఊర్లో మేకలు తోలుకుంటూ ఉంటాడు. చదువుల కోసం వేరే ఊరు వెళ్ళిన సత్య(విస్మయ), చదువు పూర్తి చేసుకుని ఊరికి వస్తుంది. సత్య, కృష్ణ ఇద్దరూ ప్రేమించుకుంటారు. కానీ వారి పెళ్ళికి పెద్దలు ఒప్పుకోరు. అదే ఊర్లోని దేవా పాత్ర సత్యను ఇష్టపడతాడు. ఈ క్రమంలో కృష్ణకు, దేవాకు గొడవ జరుగుతుంది.
10లక్షలు దొంగతనం
మరోవైపు కృష్ణ అమ్మకు క్యాన్సర్ అని తెలుస్తుంది. ట్రీట్మెంట్ కోసం 10లక్షలు అప్పు తెస్తే వాటిని ఎవరో దొంగిలిస్తారు. ఆ దొంగలు ఎవరు? దేవా బారి నుండి సత్యను కృష్ణ ఎలా రక్షించుకుంటాడనేదే కథ. సినిమా ఎలా ఉందంటే? ఫస్టాఫ్ లో సత్య, కృష్ణ పాత్రల మధ్య ప్రేమకథ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సెకండాఫ్ లో ఎమోషన్స్ ఎక్కువగా ఉన్నాయి. అసలు కథ మొత్తం సెకండాఫ్ లోనే ఉంటుంది. నిజానికి ఇది చాలా సింపుల్ కథ. ఇలాంటి కథలు చాలా వచ్చాయి కూడా. కానీ ఇందులోని కథనం సినిమా మీద ఆసక్తిని పెంచుతుంది.
ఎవరెలా చేసారంటే?
పల్లెటూరి యువకుడి పాత్రలో రిష్వి తిమ్మరాజు ఫర్వాలేదు అనిపించుకున్నాడు. మొదటి సినిమా కాబట్టి కొన్ని సీన్లలో కాస్త తడబాటు కనిపించింది. హీరోయిన్ విస్మయ శ్రీ తన పాత్ర పరిధి మేరకు ఆకట్టుకుంది. దేవా పాత్రలో విలన్ గా కనిపించిన నటుడు తనదైన శైలితో మెప్పించాడు. పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం సినిమాకు సరిపోయేట్టుగా ఉంది. నిర్మాణ విలువలు సినిమా తగ్గట్టుగా ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని చెప్పవచ్చు.