
లక్ష్మీ రాయ్ గా వెండితెరకు పరిచయమై రాయ్ లక్ష్మీగా పేరు మార్చుకున్న హీరోయిన్ జీవితంలోని ఆసక్తికరమైన విషయాలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు సినిమాకు లక్ష్మీ రాయ్ గా పరిచయమైన ఈ కన్నడ భామ, తమిళంలో మాత్రం రాయ్ లక్ష్మీగా ఎంట్రీ ఇచ్చింది. జాతకానికి సంబంధించిన కారణాల వల్ల తన పేరును మార్చుకుంది.
ఈరోజు లక్ష్మీ రాయ్ పుట్టినరోజు. 34వ వడిలోకి అడుగుపెడుతోన్న లక్ష్మీ రాయ్ జీవితంలోని ఆసక్తికరమైన విషయాలు మాట్లాడుకుందాం.
కర్ణాటకలోని బెలగావి తన స్వస్థలం. మొదట మోడలింగ్ చేసిన లక్ష్మీ రాయ్, శరవణ స్టోర్స్, ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్స్ లో కనిపించింది.
తమిళంలో ఎంట్రీ:
2005లో రిలీజైన కార్కా కాసదరా అనే చిత్రంతో హీరోయిన్ గా తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అదే సంవత్సరం కాంచమానల కేబుల్ టీవీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
Details
అప్పట్లో క్రికెటర్ ధోనీతో రిలేషన్ అంటూ వార్తలు
దక్షిణాదిన అన్ని భాషల్లో కనిపించిన లక్ష్మీరాయ్, 2017లో జూలీ 2 సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ కు పరిచయమైంది. ఇప్పటి వరకు 50కి పైగా సినిమాల్లో కనిపించింది.
హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే ఐటెం సాంగ్స్ లోనూ లక్ష్మీ రాయ్ మెరిసింది. ఖైదీ నంబర్ 150 సినిమాలో రత్తాలు రత్తాలు అనే పాటలో చిరంజీవితో స్టెప్పులు వేసింది.
హీరోయిన్ల కెరీర్లో పుకార్లు కామన్ గా ఉంటాయి. అప్పట్లో ధోనీతో లక్ష్మీ రాయ్ రిలేషన్ లో ఉందంటూ పుకార్లు వచ్చాయి.
తెలుగులో ఆమె చేసిన సినిమాలు చాలా తక్కువ. చివరగా ఆమె నటించిన తెలుగు చిత్రం వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ, 2019లో విడుదలైంది. ప్రస్తుతం తమిళ సినిమాల్లో బిజీగా ఉంది.