Page Loader
గుండెపోటుతో లపతగంజ్ యాక్టర్ అరవింద్ కుమార్ కన్నుమూత 
లపతగంజ్ సిరీస్ నటుడు అరవింద్ కన్నుమూత

గుండెపోటుతో లపతగంజ్ యాక్టర్ అరవింద్ కుమార్ కన్నుమూత 

వ్రాసిన వారు Sriram Pranateja
Jul 14, 2023
06:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

లపతగంజ్ సిరీస్ నటుడు అరవింద్ కుమార్ హఠాత్తుగా మరణించారు. సిరీస్ షూటింగుకు వెళ్తుండగా గుండెపోటు రావడంతో తోటి నటులు ఆయన్ని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగానే అరవింద్ కుమార్ తుదిశ్వాస విడిచారు. లపతగంజ్ సిరీస్ లో చౌరాసియా అనే పాత్రలో అరవింద్ కుమార్ కనిపించారు. ఈ పాత్రకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అరవింద్ కుమార్ మరణించిన విషయాన్ని లపతగంజ్ సిరీస్ యాక్టర్ రోహితాశ్వ్ వెల్లడిచేసారు. షూటింగుకు వెళ్తుండగా గుండెపోటుతో చనిపోయారని రోహితాశ్వ్ చెప్పుకొచ్చారు. అరవింద్ కుమార్ కు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయని, ఆ కారణంగా ఆరోగ్యం దెబ్బ తినుండచ్చని రోహితాశ్వ్ అన్నారు.

Details

కరోనా తర్వాత ఆర్టిస్టులకు ఆర్థిక ఇబ్బందులు 

అరవింద్ కుమార్ మంగళవారం చనిపోయారని తెలియజేసిన రోహితాశ్వ్, అతని కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియజేయలేదని, కుటుంబ సభ్యులంతా గ్రామంలో ఉంటారనీ, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ దొరకలేదనీ, ఈరోజు ఫోన్ నంబర్ తెలియడంతో కాల్ చేసానని అన్నారు. కరోనా తర్వాత ఆర్టిస్టులకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని, దానివల్ల ఒత్తిడి బాగా పెరిగిపోయిందని రోహితాశ్వ్ మాట్లాడారు. అరవింద్ కుమార్ కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటామని, అందుకోసం తోటి నటుల నుండి సాయాన్ని కోరుతున్నామని, రోహితాశ్వ్ తెలియజేసారు.