IIFA Awards 2025: ఐఫా 2025లో 'లాపతా లేడీస్' హవా.. 10 అవార్డులతో దుమ్మురేపింది!
ఈ వార్తాకథనం ఏంటి
ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా అవార్డుల వేడుక ఘనంగా ముగిసింది.
జైపూర్ వేదికగా రెండు రోజుల పాటు ఈ వేడుకలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
శని, ఆదివారాల్లో జరిగిన ఈ ఈవెంట్‌లో మొదట డిజిటల్ అవార్డులను ప్రకటించగా, ఆదివారం రాత్రి చలనచిత్ర విభాగంలో పురస్కారాలను ప్రదానం చేశారు.
ఈసారి 'లాపతా లేడీస్' చిత్రం దుమ్మురేపింది. ఉత్తమ చిత్రంతో సహా మొత్తం 10 అవార్డులను గెలుచుకుంది.
ఇక ప్రముఖ నటుడు కార్తిక్ ఆర్యన్, నటి నితాన్షి గోయల్ అత్యుత్తమ నటుడిగా, నటిగా ఎంపికయ్యారు.
Details
ఐఫా అవార్డు విజేతలు - 2025
ఉత్తమ చిత్రం - లాపతా లేడీస్
ఉత్తమ నటుడు - కార్తిక్ ఆర్యన్(భూల్ భూలయ్యా 3)
ఉత్తమ నటి - నితాన్షి గోయల్(లాపతా లేడీస్)
ఉత్తమ దర్శకురాలు - కిరణ్ రావు లాపతా లేడీస్)
ఉత్తమ విలన్ - రాఘవ్ జాయల్(కిల్)
ఉత్తమ సహాయనటి - జాకీ బోడివాలా(షైతాన్)
ఉత్తమ సహాయనటుడు - రవి కిషన్ లాపతా లేడీస్)
ఉత్తమ కథ (ఒరిజినల్) - బిప్లాబ్ గోస్వామి(లాపతా లేడీస్)
ఉత్తమ నటి (తొలి పరిచయం) - ప్రతిభా(లాపతా లేడీస్)
ఉత్తమ సంగీత దర్శకుడు రామ్ సంపత్(లాపతా లేడీస్)
ఉత్తమ సాహిత్యం - ప్రశాంత్ పాండే(లాపతా లేడీస్)
ఉత్తమ స్క్రీన్‌ప్లే - స్నేహా దేశాయ్(లాపతా లేడీస్)
ఉత్తమ ఎడిటింగ్ - జాబిన్ మార్చంట్(లాపతా లేడీస్)