
చంద్రముఖి 2 సినిమా షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్: అభిమానులు రెడీగా ఉండాల్సిందే
ఈ వార్తాకథనం ఏంటి
రజనీకాంత్ హీరోగా, పి వాసు దర్శకత్వంలో వచ్చిన చంద్రముఖి సినిమా, ఎంత పెద్ద విజయం అందుకుందో అందరికీ తెలుసు.
నయన తార, జ్యోతిక హీరోయిన్లుగా కనిపించిన ఈ చిత్రం, బాక్సాఫీసు వద్ద వసూళ్ళ సునామీని సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా చంద్రముఖి 2 వచ్చేస్తోంది.
రాఘవ లారెన్స్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ పై అప్డేట్ వచ్చింది. చంద్రముఖి 2 సినిమా షూటింగ్ పూర్తయిపోయిందని, చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది.
ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరగాల్సి ఉంది. చంద్రముఖి 2 సినిమాలో సీనియర్ నటి రాధిక, కమెడియన్ వడివేలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
లైకా ప్రొడక్షన్స్ ట్వీట్
And... Cut! Chandramukhi 2 shooting has officially packed up. 🎬 We can't contain our excitement for fans to experience it on the big screen. 🤩🕴🏻🔥 #Chandramukhi2 🗝️ #CM2 🗝️
— Lyca Productions (@LycaProductions) June 20, 2023
🎬 #PVasu
🌟 @offl_Lawrence @KanganaTeam
🎶 @mmkeeravaani
🎥 @RDRajasekar
🛠️ #ThottaTharani
✂️🎞️… pic.twitter.com/cqxHM8ZJ86