సీనియర్ హీరోయిన్ సుమలత కొడుకు వివాహం: హాజరైన మోహన్ బాబు, రజనీ కాంత్, కేజీఎఫ్ స్టార్ యశ్
కన్నడ యాక్టర్ అంబరీష్, సీనియర్ తెలుగు హీరోయిన్ సుమలత దంపతుల కొడుకు అభిషేక్ వివాహం, అవివా బిడప్పా అనే మోడల్ తో ఈరోజు జరిగింది. ఈ వివాహ వేడుకకు అతిధులుగా దక్షిణాది సినిమా ఇండస్ట్రీ సెలెబ్రిటీలు హాజరయ్యారు. సినిమా రంగం నుండే కాకుండా రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకలో కనిపించారు. కేజీఎఫ్ స్టార్ యశ్, రజనీ కాంత్, మోహన్ బాబు, మంచు విష్ణు తదితరులు పెళ్ళి వేడుకలో పాల్గొన్నారు. ఇక రాజకీయ ప్రముఖులలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కనిపించారు. ప్రస్తుతం ఈ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.