తదుపరి వార్తా కథనం
సిటాడెల్ నుండి సమంత, వరుణ్ ధావన్ ల ఫోటోలు లీక్, ఇంటర్నెట్ లో వైరల్
వ్రాసిన వారు
Sriram Pranateja
Apr 11, 2023
04:53 pm
ఈ వార్తాకథనం ఏంటి
మయోసైటిస్ నుండి నెమ్మదిగా కోలుకుంటున్న సమంత, వరుసగా సినిమా షూటింగుల్లో పాల్గొంటూ బిజీగా గడుపుతోంది. ఇటు శాకుంతలం సినిమా రిలీజ్ కు దగ్గర పడుతుంటే అటు సిటాడెల్ భారతీయ వెర్షన్ చిత్రీకరణలో పాల్గొంటోంది.
సిటాడెల్ సిరీస్ షూటింగ్ ముంబై పరిసరాల్లో జరుగుతోంది. తాజాగా ఈ సిరీస్ షూటింగ్ నుండి సమంత, వరుణ్ ధావన్ ల ఫోటోలు లీక్ అయ్యాయి. ఫార్మల్ డ్రెస్ లో సమంత కనిపించగా, బ్రౌన్ కలర్ టీ షర్ట్ లో వరుణ్ ధావన్ మెరిశాడు.
ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. ఈ సిటాడెల్ సిరీస్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవనుంది. రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ ని డైరెక్ట్ చేస్తున్నారు.