NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం: కళాతపస్వి కే విశ్వనాథ్ కన్నుమూత
    తదుపరి వార్తా కథనం
    తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం: కళాతపస్వి కే విశ్వనాథ్ కన్నుమూత
    కళాతపస్వి కే విశ్వనాథ్ కన్నుమూత

    తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం: కళాతపస్వి కే విశ్వనాథ్ కన్నుమూత

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 03, 2023
    09:51 am

    ఈ వార్తాకథనం ఏంటి

    శంకరాభరణం, సాగర సంగమం, సిరివెన్నెల, స్వాతిముత్యం చిత్రాల దర్శకుడు కళాతపస్వి కే విశ్వనాథ్, గురువారం అర్థరాత్రి హైదరాబాద్ లో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

    గతకొన్ని రోజులుగా వయసు సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్న కే విశ్వనాథ్, 92ఏళ్ళ వయసులో పరమపదించారు. దీంతో టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది.

    కే విశ్వనాథ్ మృతిపై తెలంగాణ ప్రభుత్వం సంతాపం తెలియజేసింది. సినీ, రాజకీయ ప్రముఖులందరూ సోషల్ మీడియా ద్వార తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

    1930లో ఆంధ్రప్రదేశ్ లోని రేపల్లె గ్రామంలో జన్మించిన కె విశ్వనాథ్, సినిమాల మీద ఇష్టంతో మద్రాసు చేరుకుని వాహిని స్టూడియోలో ఆడియోగ్రాఫర్ గా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయ్యారు.

    కే విశ్వనాథ్

    5 నేషనల్ అవార్డులు, 10నంది అవార్డులు అందుకున్న కే విశ్వనాథ్

    1951లో పాతాళ భైరవి సినిమా కోసం కే విశ్వనాథ్ అసిస్టెంట్ గా పనిచేసారు. 1965లో ఆత్మగౌరవం సినిమాతో దర్శకుడిగా విశ్వనాథ్ కెరీర్ మొదలైంది. ఉత్తమ చిత్రంగా ఆ సినిమా నంది అవార్డు గెలుచుకోవడం విశేషం.

    ఆ తర్వాత చెల్లిలి కాపురం(1971), శారద(1973), ఓ సీత కథ(1974), జీవన జ్యోతి(1975) చిత్రాలకు దర్శకుడిగా పనిచేసారు.

    1980లో వచ్చిన శంకరాభరణం సినిమాతో విశ్వనాథ్ పేరు దేశమంతటా వ్యాపించింది. ఈ సినిమాకు 4జాతీయ అవార్డులు వచ్చాయి. సుర్ సుంగమ్ పేరుతో హిందీలో రీమేక్ అయ్యింది.

    తన కెరీర్లో 5జాతీయ అవార్డులు, 10 నంది అవార్డులు, 10 ఫిలిమ్ ఫేర్ అవార్డులు అందుకున్నాడు విశ్వనాథ., 1992లో భారత ప్రభుత్వం పద్మశ్రీ తో సత్కరించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టాలీవుడ్

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    టాలీవుడ్

    పవన్ కళ్యాణ్ క్రిస్మస్ బహుమతులు… ఆనందంలో ఆ డైరెక్టర్ పవన్ కళ్యాణ్
    వీరసింహారెడ్డి: బాలయ్య మనోభావాలు దెబ్బతిన్నాయి సినిమా
    బాలయ్యను కలిసిన పవన్ కళ్యాణ్.. కారణం అదేనంటూ అభిమానుల గోల తెలుగు సినిమా
    తెలుగు సినిమాల దెబ్బా.. తమిళ సినిమాలు అబ్బా తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025