LENIN : లెనిన్ కొత్త పోస్టర్ రిలీజ్.. కానీ విడుదల తేదీ మిస్సింగ్!
ఈ వార్తాకథనం ఏంటి
అక్కినేని కుటుంబానికి చెందిన యంగ్ హీరో అక్కినేని అఖిల్ తన తదుపరి చిత్రం లెనిన్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. 'వినరో భాగ్యము విష్ణుకథ'తో గుర్తింపు పొందిన దర్శకుడు 'మురళి కిషోర్ అబ్బూరు' (నందు) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. మొదటగా 'లెనిన్'ను ఈ ఏడాది సమ్మర్ కానుకగా మే 1న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే విడుదల తేదీపై ఇప్పుడు అనిశ్చితి నెలకొంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా చిత్ర నిర్మాతలు కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో అఖిల్ లుక్ ఆకట్టుకున్నప్పటికీ, విడుదల తేదీని ఎక్కడా పేర్కొనలేదు.
Details
వాయిదా పడినట్లు సమాచారం
దీంతో సినిమా వాయిదా పడినట్టే అనే ప్రచారం ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. ఈ వాయిదాకు ప్రధాన కారణంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం 'పెద్ది' అని చెబుతున్నారు. దర్శకుడు బుబ్చి తెరకెక్కిస్తున్న 'పెద్ది'ను ఏప్రిల్ 30న విడుదల చేయనున్నట్లు తాజాగా అధికారిక ప్రకటన వెలువడింది. 'పెద్ది' విడుదలైన మరుసటి రోజే, అంటే మే 1న 'లెనిన్'ను విడుదల చేయాలనే ప్లాన్ ఉండేది. అయితే పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న భారీ చిత్రంతో పోటీ పడటం రిస్క్‌గా భావించిన 'లెనిన్' మేకర్స్ విడుదలను వాయిదా వేసినట్లు సమాచారం.
Details
జూన్ లో రిలీజయ్యే అవకాశం
ప్రస్తుతం కొత్త విడుదల తేదీపై చిత్రబృందం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. 'పెద్ది' ప్రభావం తగ్గిన తర్వాత మే నెల చివరిలో లేదా జూన్‌లో 'లెనిన్' థియేటర్లలోకి వచ్చే అవకాశముందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అఖిల్ తన కెరీర్‌లో అత్యంత వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తున్న ఈ సినిమా అక్కినేని అభిమానులకు కొత్త అనుభూతిని అందిస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది.