ఎన్టీఆర్ రామారావు బర్త్ డే: దర్శకుడిగా ఎన్టీఆర్ తెరకెక్కించిన సినిమాలు
అప్పటివరకూ దేవుళ్ళను కేవలం పటాల్లో మాత్రమే చూసిన తెలుగు ప్రేక్షకులు, వెండితెర మీద దేవుడి పాత్రలో కనిపించిన ఎన్టీఆర్ ను చూసి పులకరించిపోయారు. పౌరాణికాలే కాదు, జానపదాలు, సాంఘీక చిత్రాల్లో ఎన్టీఆర్ కనిపించారు. అయితే హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడిగా మారి మెగాఫోన్ పట్టుకుని సినిమాలను రూపొందించారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన సినిమాల గురించి మాట్లాడుకుందాం. 1961లో సీతారామ కళ్యాణం సినిమతో దర్శకుడిగా మారారు ఎన్టీఆర్. ఆ తర్వాత 1962లో గులేబకావలి కథ ను తెరకెక్కించారు. 1966లో శ్రీకృష్ణ పాండవీయం సినిమాను రూపొందించారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే కూడా ఎన్టీఆర్ సమకూర్చారు. ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం దాన వీర శూర కర్ణ.
10లక్షలతో రూపొందిన దాన వీర శూర కర్ణ
1977లో రిలీజైన దాన వీర శూర కర్ణ చిత్రంలో కర్ణుడిగా, కృష్ణుడిగా, దుర్యోధనుడిగా మూడు పాత్రల్లో కనిపించారు ఎన్టీఆర్. 10లక్షల ఖర్చుతో రూపొందిన ఈ సినిమా 2కోట్ల వసూళ్ళు వచ్చాయి. దాన వీర శూర కర్ణ సినిమాకు దర్శకత్వం చేయడంతో పాటు కథ, స్క్రీన్ ప్లే అందించారు ఎన్టీఆర్. తెలుగు సినిమా చరిత్రలో గొప్ప చిత్రంగా మిగిలిపోయింది . ఎన్టీఆర్ దర్శకత్వంలో మొత్తం 21సినిమాలు వచ్చాయి. ఈ జాబితాలో శ్రీ మద్విరాట పర్వం, శ్రీ మద్విరాజ్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర మొదలగు సినిమాలున్నాయి. చివరగా ఆయన డైరెక్ట్ చేసిన మూవీ సామ్రాట్ అశోక(1992). ఎన్టీఆర్ దర్శకత్వంలో 1991లో వచ్చిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చిన్న పాత్రలో నటించారు.