Ravi Teja : మారెమ్మ' సినిమా చూశాను.. చాలా బాగుంది.. నాకు చాలా నచ్చింది: రవితేజ
ఈ వార్తాకథనం ఏంటి
మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా 'మారెమ్మ' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. విలేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో మంచాల నాగరాజు దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్ రెడ్డి బండారు ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌తో పాటు పాటలకు కూడా మంచి స్పందన వచ్చింది. సెప్టెంబర్ 10న 'మారెమ్మ' ప్రేక్షకుల ముందుకు రానుంది.
వివరాలు
హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్..
ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది.
ఈ కార్యక్రమానికి మాస్ మహారాజా రవితేజ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''అందరికీ గుడ్ ఈవెనింగ్. నేను ఈ సినిమా చూశాను. చాలా బాగుంది.
రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. చాలా రూటెడ్‌గా ఉంది. తెలంగాణలోని మైసాపురం బ్యాక్‌గ్రౌండ్ చాలా బాగుంది. నాకు ఈ సినిమా చాలా నచ్చింది.
డెఫినెట్‌గా ప్రేక్షకులకు కూడా బాగా నచ్చుతుందని నమ్ముతున్నాను.
ప్రశాంత్ విహారి అందించిన పాటలు చాలా బాగున్నాయి. ఆయనకు మంచి ఫ్యూచర్ ఉంది.
అలాగే డీఓపీ ప్రశాంత్ వర్క్ కూడా చాలా బాగుంది. ఈ సినిమా నిర్మాతలు మయూర్, కుశాల్‌కు మంచి సక్సెస్, డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
వివరాలు
యంగ్ టాలెంట్‌ను ఆదరించిన మాస్ మహరాజ్..
నాగరాజుకు ఇది మొదటి సినిమా అయినప్పటికీ చాలా అద్భుతంగా దర్శకత్వం వహించారు.
ఇలాంటి సబ్జెక్ట్‌ను మాధవ్‌తో చేయడం చాలా బాగుంది. తమ్ముడు మాధవ్ బాగున్నాడు'' అంటూ రవితేజ అన్నారు.
మాధవ్ తన ట్రాన్స్‌ఫర్మేషన్‌ను పర్ఫెక్ట్‌గా చూపించాడని ప్రశంసించారు. ''తనకు ఆల్ ది వెరీ బెస్ట్. సెప్టెంబర్ 10న సినిమా రిలీజ్ అవుతుంది.
అందరూ ఈ సినిమాను చూస్తారని, యంగ్ టాలెంట్‌ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. జై సినిమా'' అంటూ రవితేజ తన స్పీచ్‌ను ముగించారు.
అలాగే డైరెక్షన్ టీమ్ పరశురామ్, శబరీష్ మూగాటి, రంజిత్ కుమార్, కళ్యాణ్, దివాన్ దూదేకుల, రితిక్, గంగాధర్, దివాకర్ లాంటి యంగ్ టాలెంట్‌ను ఆయన ఆశీర్వదించారు.