మావారు మాస్టారు సీరియల్ ని ప్రేక్షకులను ముందుకు తీసుకువస్తున్న జీ తెలుగు
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు రాష్ట్రాల ప్రజలకు 24 గంటలు వినోదం పంచే జీ తెలుగు, సరికొత్త సీరియల్‌తో మీ ముందుకు రానుంది.
తన భర్త నలుగురికీ చదువు చెప్పే టీచర్ అయ్యుండాలని కలలు కనే ఓ అమ్మాయి.. తన కొడుకు నలుగురికీ బతకడం నేర్పించే బడిపంతులని గర్వపడే ఓ తల్లి, వారిద్దరి అంచనాలకు అందని ఉద్యోగం చేస్తూ వేదన చెందే వ్యక్తి జీవితంతో ముడిపడిన కథతో సాగే సీరియల్ మావారు మాస్టారు.
ప్రేక్షకులకు తమ స్కూల్ డేస్‌ని గుర్తుచేస్తూ మనసుకి హత్తుకునే కథనంతో సాగే మావారు మాస్టారు, సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 07:30 గంటలకు ప్రసారం అవుతుంది. జూన్ 12నుండి ప్రారంభం కానుంది.
Details
మావారు మాస్టారు సీరియల్ లో నటించే నటులు
జీ తెలుగు అందిస్తున్న కొత్త సీరియల్ భార్యాభర్తలు, అత్తాకోడళ్ల బంధానికి సరికొత్త అర్థం చెబుతుంది.
టీచర్నే పెళ్లి చేసుకోవాలని కలలు కనే అమ్మాయి శ్రీ విద్య, అందరూ గౌరవించే ఉపాధ్యాయ వృత్తిలో కొడుకు ఉన్నాడని సంతోషించే పార్వతి, తల్లి సంతోషం కోసం అబద్ధం చెప్పి వేదన చెందే గణపతి వంటి ప్రధాన పాత్రలతో ఈ కథ ముడిపడి ఉంటుంది.
శ్రీ విద్యగా సంగీత కల్యాణ్‌కుమార్ నటిస్తుండగా, పార్వతిగా మీనా కుమారి నటిస్తున్నారు. గణపతిగా పృథ్వీరాజ్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పాపులర్ నటుడు కౌశిక్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.