
మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయ్ అంటున్న మంచు లక్ష్మీ
ఈ వార్తాకథనం ఏంటి
మంచు లక్ష్మీ.. పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు సినిమాల్లో నటిస్తూ టెలివిజన్ మీద టాక్ షోలు చేస్తూ తెలుగు వారందరికీ పరిచయమైంది మంచులక్ష్మీ.
లక్ష్మీ టాక్ షోతో మొదలైన మంచులక్ష్మీ ప్రయాణం విజయవంతంగా కొనసాగుతోంది. తాజాగా టాక్ షోస్ తగ్గించేసింది మంచు లక్ష్మీ. సినిమాల్లో కూడా రెగ్యులర్ గా కనిపించడం లేదు.
ఈ మధ్య మాన్ స్టర్ అనే మళయాలం సినిమాలో తళుక్కున మెరిసింది. ప్రస్తుతం మోహాబ్ బాబు ప్రధాన పాత్రలో వస్తున్న అగ్ని నక్షత్రం సినిమాలో నటిస్తుంది మంచు లక్ష్మీ.
ఐతే సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే మంచు లక్ష్మీ, తాజాగా మా బావ మనోభావాల్ దెబ్బతిన్నాయ్ అంటూ ఇన్స్టా గ్రామ్ లో సందడి చేస్తోంది.
వీరసింహారెడ్డి
బాలయ్య పాటకు మంచు లక్ష్మీ ఆట
తాజాగా విడుదలైన బాలకృష్ణ చిత్రం వీరసింహారెడ్డిలోని "మా బావ మనోభావాల్ దెబ్బతిన్నాయే" అనే పాటకు తనదైన శైలిలో స్టెప్పులు వేసింది మంచులక్ష్మీ.
డాన్స్ వీడియోతో షేర్ చేస్తూ, సంక్రాంతి కానుకగా వస్తున్న వీరసింహారెడ్డి సినిమాను వెండితెర మీద చూసేందుకు ఆసక్తిగా ఉన్నానని తెలిపింది.
బ్లాక్ డ్రెస్ లో అందంగా స్టెప్పులేస్తున్న వీడియో, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంతకుముందు వాల్తేరు వీరయ్య సినిమాలోని వేర్ ఈజ్ ద పార్టీ పాటకు కూడా స్టెప్పులేసింది మంచులక్ష్మీ.
ప్రస్తుతం ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. బాక్సాఫీసు వద్ద రెండు సినిమాలకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. మరి ఈ రెండింటిలో సంక్రాంతి విన్నర్ గా ఏది నిలుస్తుందో.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వీరసింహారెడ్డి సినిమాలోని పాటకు మంచు లక్ష్మీ డాన్స్
Ruling our మనోభావాలు since forever. Can't wait to see the sankranti mass rampage of #Balayya!#VSR #VeeraSimhaReddy #JaiBalayya #VeeraSimhaReddyOnJan12th pic.twitter.com/jN9s4sujjR
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) January 11, 2023