Rashmika Mandanna - Madhubala: రష్మికకు మధుబాల మద్దతు.. దక్షిణాది యాసపై ట్రోలింగ్‌కు గట్టి సమాధానం!
ఈ వార్తాకథనం ఏంటి
హిందీ సినిమాల్లో తన దక్షిణాది యాసపై సోషల్ మీడియాలో ఎదురైన ట్రోలింగ్‌పై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నటి రష్మిక మందన్న స్పందించిన విషయం తెలిసిందే. తాను దక్షిణాదికి చెందిన అమ్మాయినని, తనకు సహజంగా ఉండే యాసను తప్పుగా చూడటంలో అర్థం లేదని ఆమె పేర్కొన్నారు. తాజాగా ఈ అంశంపై ప్రముఖ రచయిత జావేద్ అక్తర్, నటి మధుబాల రష్మికకు మద్దతుగా నిలిచారు. రష్మిక యాసపై విమర్శలు చేసేవారికి జావేద్ అక్తర్ ఎక్స్ వేదికగా గట్టిగా సమాధానమిచ్చారు. నటి రష్మిక యాసపై ఎవరికైనా సమస్య ఉంటే.. ప్రపంచంలోని అత్యంత పురాతన భాషల్లో కొన్ని వాక్యాలను చదవమని వారికి చెప్పండి.
వివరాలు
ఇలాగే అత్మవిశ్వాసంతో ఉండాలి
అప్పుడు వారు వాటిని ఎంత బాగా పలకగలరో చూద్దాం. ఇలాంటి అవాస్తవమైన, నిరాధారమైన భాషా ఆధిక్యత ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన పేర్కొన్నారు.
అలాగే నటి మధుబాల కూడా రష్మికకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పంచుకుంటూ, విమర్శలను రష్మిక ఎదుర్కొన్న తీరును ప్రశంసించారు.
'రష్మిక.. నువ్వు విమర్శలను చూసి నవ్వుతూ, వాటిని అంగీకరించిన తీరు నాకు ఎంతో నచ్చింది. హుందాగా సమాధానం చెబుతూ ముందుకు సాగుతున్నావు. ఇలాగే ఆత్మవిశ్వాసంతో ఉండాలని మధుబాల అన్నారు.
తాను హిందీ సినిమాల్లో నటించడం ప్రారంభించిన సమయంలో ఎదురైన అనుభవాలను కూడా ఆమె ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
వివరాలు
హిందీ భాషపై పట్టు సాధించా
'దక్షిణాదికి చెందిన అమ్మాయిననే కారణంతో ఎలాంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని నేను భయపడేదాన్ని. అందుకే ఉర్దూ టీచర్‌ను పెట్టుకుని హిందీ భాషపై పట్టు సాధించాను.
నా యాస బయటపడకుండా ఉండేందుకు ప్రయత్నించేదాన్ని. అయితే, ఇప్పుడు దక్షిణాది యాసతో కూడిన నా గుర్తింపు పట్ల నేను గర్వపడుతున్నానని మధుబాల వెల్లడించారు.
ఈ స్థాయికి చేరుకోవడానికి తనకు 30 ఏళ్లు పట్టిందని, కానీ రష్మిక ఇప్పటికే ఆ స్థాయికి చేరుకుందని ఆమె ప్రశంసించారు.
దక్షిణాది యాస కారణంగా రష్మికపై జరుగుతున్న ట్రోలింగ్‌కు జావేద్ అక్తర్, మధుబాల మద్దతుగా నిలవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.