LOADING...
Pankaj Dheer: సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. బాలీవుడ్ ప్రముఖ నటుడు పంకజ్ ధీర్ కన్నుమూత 
Pankaj Dheer: బాలీవుడ్ ప్రముఖ నటుడు పంకజ్ ధీర్ కన్నుమూత

Pankaj Dheer: సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. బాలీవుడ్ ప్రముఖ నటుడు పంకజ్ ధీర్ కన్నుమూత 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 15, 2025
04:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

'మహాభారతం' హిందీ సీరియల్‌లో కర్ణుడి పాత్ర పోషించి అభిమానుల మన్ననలు అందుకున్న పంకజ్ ధీర్ కన్నుమూశారు. ఈ విషాదాన్ని ఆయన స్నేహితుడు అమిత్ బహల్ ధృవీకరించారు. పంకజ్ చాలా సంవత్సరాలుగా క్యాన్సర్‌తో పోరాడుతూ, శస్త్రచికిత్సల ద్వారా కొంతకాలం జయించగలిగారు. అయితే కొన్ని నెలల క్రితం ఆయనకు మళ్లీ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటూనే కన్నుమూశారు పంకజ్. బుధవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఆయన తుది శ్వాస విడిచారు.

వివరాలు 

'మహాభారతం' సీరియల్ తో ప్రత్యేక గుర్తింపు 

పంకజ్ ధీర్ మరణ వార్త బాలీవుడ్ లో విషాదాన్ని నెలకొల్పింది. 'మహాభారతం'లో అర్జున్ పాత్ర పోషించిన ఫిరోజ్ ఖాన్ స్పందిస్తూ, "పంకజ్ ఇక లేరన్నది నిజమే. వ్యక్తిగతంగా, నేను నా ప్రాణ స్నేహితుడిని కోల్పోయాను.ఈ బాధ చాలా పెద్దది. ఆయన చాలా మంచి మనిషి.యన కన్నుమూశారంటే ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను' అని వాపోయారు. పంకజ్ ధీర్ అనేక సీరియల్స్, సినిమాల్లో నటించారు.అయితే బి.ఆర్. చోప్రా దర్శకత్వంలో తెరకెక్కిన 'మహాభారతం' సీరియల్ ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఇందులో కర్ణుడిగా ఆయన అద్భుతమైన అభినయానికి మంచి ప్రశంసలు లభించాయి. అలాగే 'చంద్రకాంత్' సీరియల్‌లో శివదత్ పాత్ర కూడా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. పంకజ్ 'బాధో బహు','యుగ్','ది గ్రేట్ మరాఠా','అజుని' వంటి హిందీ సీరియల్స్‌లో నటించారు.

వివరాలు 

నికితాన్ ధీర్ కూడా నటుడే 

ముంబైలోని విలే పార్లే శ్మశానవాటికలో సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో పంకజ్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయనకు భార్య అనితా ధీర్, కుమారుడు నికితాన్ ధీర్ ఉన్నారు. నికితాన్ కూడా సీరియల్స్, సినిమాల్లో నటిస్తున్నాడు. 'చెన్నై ఎక్స్‌ప్రెస్'లో తంగబలి పాత్రలో అందరి దృష్టిని ఆకర్షించాడు. తెలుగు సినిమాల్లో విలన్‌గా కూడా నటించారు. నికిత్ తండ్రిలా పౌరాణిక సీరియల్స్‌లో కూడా నటించారు; 'శ్రీమద్ రామాయణం' సీరియల్‌లో రావణుడి పాత్రను పోషించారు. పంకజ్ ధీర్ భార్య, కోడలు కృతికా సెంగర్ కూడా నటిగా గుర్తింపు పొందారు.