Kannapa : కన్నప్ప' నుంచి మహదేవ శాస్త్రి గ్లింప్స్ రివీల్‌కి సిద్ధం.. ఎప్పుడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'కన్నప్ప' రిలీజ్‌కు సిద్ధమైంది.
మంచు విష్ణు హీరోగా, ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, కాజల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
రిలీజ్‌కి రెడీ!
ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 25న గ్రాండ్‌గా విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు పూర్తి చేసింది.
మోహన్ బాబు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్ బాబు 'మహదేవ శాస్త్రి' అనే పవర్‌ఫుల్ పాత్రలో మెస్మరైజ్ చేయనున్నారు.
Details
రేపే గ్లింప్స్ రిలీజ్
ఇప్పటికే విడుదలైన ప్రతి అప్డేట్‌కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా మార్చి 19న ఆయన పోషించిన 'మహదేవ శాస్త్రి' పాత్రకు సంబంధించిన గ్లింప్స్ విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఈ ఇంట్రో సాంగ్ ప్రేక్షకులను కట్టిపడేస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ నుంచి నిత్యం వివాదాల్లో నిలుస్తూనే ఉంది. 'శివయ్య' సాంగ్, లవ్ సాంగ్ విడుదల సమయంలో విమర్శలు వచ్చాయి.
అయినప్పటికీ మంచు విష్ణు ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ప్రమోషన్స్‌లో పాల్గొంటూ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు.
సినిమా 2వ శతాబ్దం నాటి కథ నేపథ్యంలో సాగుతుండటంతో, అప్పటి దుస్తులు, పరిసరాలను పరిశీలించి రూపొందించామని విష్ణు తెలిపారు.