Mahendragiri Varahi Review: మహేంద్రగిరి వారాహి రివ్యూ.. సుమంత్ సినిమా ఎలా ఉందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
అక్కినేని కుటుంబానికి చెందిన సుమంత్ హీరోగా, 'సుబ్రహ్మణ్యపురం' దర్శకుడు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మహేంద్రగిరి వారాహి'. మీనాక్షి గోస్వామి కథానాయికగా నటించిన ఈ సినిమాలో బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, ఒకప్పటి నటి మంజు భార్గవి తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. మరి ఆ అంచనాలను 'మహేంద్రగిరి వారాహి' అందుకుందా? తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎంతవరకు ఆకట్టుకుంది? ఇప్పుడు మూవీ రివ్యూలో చూద్దాం.
వివరాలు
మహేంద్రగిరి వారాహి కథ ఇదే
విజయనగరం జిల్లాకు సమీపంలో ఉన్న మహేంద్రగిరి అనే గ్రామానికి వారాహి అమ్మవారు గ్రామదేవతగా ఉంటారు.
అయితే ఆ ఊరి రాజ కుటుంబానికి వారాహిమాత శాపం ఉంటుంది. ఈ శాపం కారణంగా రాజ కుటుంబానికి చెందిన వారసుడు 33 ఏళ్ల వయసులో ఏదో ఒక ప్రమాదంలో మరణిస్తూ ఉంటాడు.
మరోవైపు హైదరాబాద్‌లో నివసించే సిద్ధార్థ్ (సుమంత్) ఓ యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తుంటాడు. భక్తి పేరుతో జరుగుతున్న మోసాలను తన ఛానల్ ద్వారా బయటపెడుతుంటాడు.
అయితే కుటుంబంలో చోటుచేసుకున్న కొన్ని అనుకోని సంఘటనల కారణంగా.. తన అన్న పెళ్లికి సంబంధించిన శాంతి పూజల కోసం సిద్ధార్థ్ హైదరాబాద్ నుంచి విజయనగరం సమీపంలోని మహేంద్రగిరి వారాహి అమ్మవారి దేవస్థానానికి చేరుకుంటాడు.
వివరాలు
ఆసక్తికరంగా కథ
అక్కడ అనుకోని పరిస్థితుల్లో రాజ కుటుంబానికి చెందిన వారసుడితో పాటు సిద్ధార్థ్ అన్న రాజీవ్, కమల్ కామరాజు కూడా మరణిస్తారు.
అయితే అసలు రాజ కుటుంబానికి చెందిన వ్యక్తితో పాటు సిద్ధార్థ్ అన్న ఎందుకు చనిపోయారు? రాజ కుటుంబానికి వారాహిమాత ఎందుకు శాపం ఇచ్చింది? అసలు ఆ శాపం నిజమేనా?
అమ్మవారు ఎందుకు ఆ కుటుంబంపై పగబట్టి వారిని చంపడానికి ప్రయత్నించింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే 'మహేంద్రగిరి వారాహి' సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిందే.