తదుపరి వార్తా కథనం
    
     
                                                                            Mahesh Babu: దర్శకుడు మహేశ్ బాబుకు బాపు-రమణ పురస్కారం
                వ్రాసిన వారు
                Stalin
            
            
                            
                                    Apr 10, 2024 
                    
                     04:21 pm
                            
                    ఈ వార్తాకథనం ఏంటి
అనుష్కశెట్టి,నవీన్ తో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు పి. మహేష్ బాబుకు బాపు -రమణ పురస్కారం లభించింది. ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీ కళా సుధా తెలుగు అసోసియేషన్ వారు బాపు-రమణల పురస్కారాన్ని మహేష్‌కు అందజేశారు. సెన్సిటివ్ కథాంశంతో ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలూ కూడా పొందారని దర్శకుడిని వారు అభినందించారు. గతేడాది మంచి టాక్ ను సంపాదించుకున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ప్రేక్షకుల్ని ఓ రేంజ్ లో నవ్వించింది. అనుష్క రీఎంట్రీతో ఓపెనింగ్స్ సంపాదించిన ఈ చిత్రం లాంగ్ రన్ లో లాభాలు తెచ్చిపెట్టింది. బాపు- రమణ పురస్కారం తనకు ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉందని, తనపై బాధ్యతను పెంచిందని దర్శకుడు తెలిపారు.