Loading...
Varanasi: 'వారణాసి'లో మహేశ్ బాబు అదిరిపోయే బుల్ ఫైట్.. హైదరాబాద్‌లో భారీ షూటింగ్!
'వారణాసి'లో మహేశ్ బాబు అదిరిపోయే బుల్ ఫైట్.. హైదరాబాద్‌లో భారీ షూటింగ్!

Varanasi: 'వారణాసి'లో మహేశ్ బాబు అదిరిపోయే బుల్ ఫైట్.. హైదరాబాద్‌లో భారీ షూటింగ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 05, 2026
10:59 am

ఈ వార్తాకథనం ఏంటి

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'వారణాసి'. జక్కన్న తెరకెక్కిస్తున్న మోస్ట్‌ అవైటెడ్‌ పాన్‌-వరల్డ్‌ మూవీ కావడంతో ఈ సినిమాపై అంతర్జాతీయ స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ యాక్షన్‌ అడ్వెంచర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన షూటింగ్‌ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 'వారణాసి'లో మహేశ్‌ బాబుపై ఓ భారీ బుల్‌ ఫైట్‌ సీక్వెన్స్‌ను తెరకెక్కించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.సినిమాలో ఈయాక్షన్‌ ఎపిసోడ్‌ అత్యంత కీలకంగా ఉండనుందని టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో మహేశ్‌ బాబు పాత్రకు సంబంధించిన పవర్‌ఫుల్‌ ఎలివేషన్‌లో బుల్‌ ఫైట్‌కు సంబంధించిన విజువల్‌ కనిపించింది.

వివరాలు

ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్

దీంతో తాజాగా వినిపిస్తున్న ఈ వార్త అభిమానుల్లో సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న సమాచారం ప్రకారం.. హైదరాబాద్‌ శివార్లలో వచ్చే వారం ఈ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ షూటింగ్‌ను నిర్వహించేందుకు చిత్రబృందం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ బుల్‌ ఫైట్‌ను భారీ స్థాయిలో, హై-క్వాలిటీ విజువల్స్‌తో తెరకెక్కించేందుకు జక్కన్న ప్రత్యేకంగా ప్లాన్‌ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇక ఈ చిత్రానికి ఆస్కార్‌ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'వారణాసి' కథ పలు ప్రాంతాలు, విభిన్న కాలాల నేపథ్యంలో సాగనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను 2027 ఏప్రిల్‌ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.

ADVERTISEMENT