LOADING...
Mahesh Babu - Sandeep Reddy: మహేశ్ బాబు - సందీప్ రెడ్డి వంగా కాంబో ఫిక్స్.. టాలీవుడ్‌లో సంచలనం!
మహేశ్ బాబు - సందీప్ రెడ్డి వంగా కాంబో ఫిక్స్.. టాలీవుడ్‌లో సంచలనం!

Mahesh Babu - Sandeep Reddy: మహేశ్ బాబు - సందీప్ రెడ్డి వంగా కాంబో ఫిక్స్.. టాలీవుడ్‌లో సంచలనం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 24, 2026
11:09 am

ఈ వార్తాకథనం ఏంటి

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ చిత్రం 'వారణాసి' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ భారీ చిత్రం 2027 ఏప్రిల్‌ 7న విడుదల కానుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక మహేశ్ తదుపరి సినిమా ఏమిటన్న చర్చలు అభిమానుల్లోనే కాదు, ట్రేడ్ వర్గాల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ నిర్మాతలు మహేశ్‌ను కలిసి భవిష్యత్ ప్రాజెక్టులపై చర్చలు జరిపినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, మహేశ్ తదుపరి సినిమా ఎంతోకాలంగా అభిమానులు ఎదురుచూస్తున్న క్రేజీ కాంబినేషన్‌లోనే ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మహేశ్ బాబు - సందీప్ రెడ్డి వంగా కలయికలో సినిమా రూపొందనుంది.

Details

ఏసియన్ సినిమాస్ బ్యానర్ పై మూవీ

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్ బ్యానర్‌పై సునీల్ నారంగ్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు ఇప్పటికే ముగిశాయని ఫిలింనగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. 'వారణాసి' చిత్రీకరణ పూర్తయ్యగానే సందీప్ రెడ్డి వంగా సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని తెలుస్తోంది. మహేశ్ కోసం సందీప్ ఇప్పటికే పవర్‌ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో మహేశ్ ఇప్పటివరకు చేయని మాస్ అండ్ ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారని టాక్. సందీప్ తన సినిమాల్లో హీరోలను అత్యంత వైల్డ్, రగ్డ్ శైలిలో చూపించడం ప్రత్యేకత.

Details

త్వరలోనే గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం

మరోవైపు మహేశ్ బాబు క్లాస్, మాస్ అప్పీల్ కలిగిన స్టార్. ఈ ఇద్దరి కలయికలో సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం. అదనంగా ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్‌తో మహేశ్ బాబు మధ్య ఉన్న వ్యాపార అనుబంధం. ముఖ్యంగా ఎఎంబి ఈ ప్రాజెక్ట్ త్వరగా ఓకే కావడానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.

Advertisement