Loading...
Sitara ghattamaneni: 'నా లిటిల్ స్టార్' అంటూ సితారకు మహేశ్ బాబు ఎమోషనల్ బర్త్‌డే విషెస్!
'నా లిటిల్ స్టార్' అంటూ సితారకు మహేశ్ బాబు ఎమోషనల్ బర్త్‌డే విషెస్!

Sitara ghattamaneni: 'నా లిటిల్ స్టార్' అంటూ సితారకు మహేశ్ బాబు ఎమోషనల్ బర్త్‌డే విషెస్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 20, 2026
04:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుమార్తె సితార ఘట్టమనేనికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా ఆమెతో కలిసి ఉన్న ఓ అందమైన ఫొటోను అభిమానులతో పంచుకున్న మహేశ్, తన కూతురిపై ఉన్న ప్రేమను భావోద్వేగంగా వ్యక్తం చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సితారను ప్రేమగా ముద్దాడుతున్న ఫొటోను షేర్ చేసిన మహేశ్ బాబు, నువ్వు ఎంత పెద్దదానివైనా.. నాకు మాత్రం ఎప్పటికీ నా లిటిల్ స్టార్‌వే. 14వ పుట్టినరోజు శుభాకాంక్షలు సితార. ఈ ఏడాది నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చోటు చేసుకోవాలని కోరుకుంటున్నాను. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానంటూ ఎమోషనల్ మెసేజ్ రాశారు.

వివరాలు

శుభాకాంక్షల వెల్లువ

మహేశ్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా కామెంట్ల రూపంలో సితారకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మరోవైపు, సితార తల్లి నమ్రతా శిరోద్కర్ కూడా తన కుమార్తెకు ప్రత్యేకంగా బర్త్‌డే విషెస్ చెప్పారు.

సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టులో, "మా జీవితాలను ఆనందంతో, ప్రేమతో నింపిన నా అందమైన కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ ఎదుగుదలను చూస్తూ ఉండటం నాకు దక్కిన గొప్ప వరం. హ్యాపీ బర్త్‌డే... ఎంతో ప్రేమతో అంటూ తన మాతృస్నేహాన్ని వ్యక్తం చేశారు.

ADVERTISEMENT