Varanasi : అద్భుతంగా నటించింది.. ప్రియాంక చోప్రాపై మహేశ్ షాకింగ్ కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన తాజా హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ది బ్లఫ్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతూ విశేష ఆదరణ పొందుతోంది. ఈ చిత్రాన్ని వీక్షించిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. 'ద బ్లఫ్' అద్భుతమైన చిత్రం. యాక్షన్, ఎమోషన్స్ అద్భుతంగా మిళితమయ్యాయి. ప్రియాంక చోప్రా తన నటనతో మరోసారి మెప్పించారంటూ మహేశ్ బాబు సోషల్ మీడియాలో అభినందించారు. మహేశ్ చేసిన ఈ పోస్టుకు ప్రియాంక స్పందిస్తూ ఇచ్చిన రిప్లై ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. "థాంక్యూ మహేశ్.. సీ యూ సూన్ ఇన్ అంటార్కిటికా!" అంటూ ఆమె పేర్కొన్నారు.
Details
వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్
ప్రస్తుతం వీరిద్దరూ దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమోళి దర్శకత్వంలో రూపొందుతున్న అంతర్జాతీయ స్థాయి యాక్షన్ అడ్వెంచర్ చిత్రం వారణాసిలో నటిస్తున్నారు. ప్రియాంక ఇచ్చిన ఈ హింట్‌తో సినిమా తదుపరి భారీ షెడ్యూల్ అంటార్కిటికా ఖండంలో జరగబోతోందని స్పష్టమవుతోంది. రాజమౌళి రూపొందిస్తున్న ఈ చిత్రం గ్లోబ్-ట్రాటింగ్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఆఫ్రికాలోని నైలు నది పరిసరాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. కథా అవసరాల మేరకు ఇప్పుడు చిత్రబృందం మంచు ఖండమైన అంటార్కిటికాకు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో మహేశ్ బాబు 'రుద్ర' పాత్రలో కనిపించనుండగా, ప్రియాంక చోప్రా 'మందాకిని' పాత్రలో నటిస్తున్నారు. విలన్‌గా ఫృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నాడు. ఈ భారీ ప్రాజెక్ట్ 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.