Loading...
Ramayana Movie English version: 'రామాయణ' ఇంగ్లిష్‌ వెర్షన్‌ నిడివిలో భారీ మార్పు.. 30 నిమిషాలు కట్‌?
'రామాయణ' ఇంగ్లిష్‌ వెర్షన్‌ నిడివిలో భారీ మార్పు.. 30 నిమిషాలు కట్‌?

Ramayana Movie English version: 'రామాయణ' ఇంగ్లిష్‌ వెర్షన్‌ నిడివిలో భారీ మార్పు.. 30 నిమిషాలు కట్‌?

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 18, 2026
05:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

రణ్‌బీర్‌ కపూర్‌, సాయి పల్లవి జంటగా నితీశ్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్‌ చిత్రం 'రామాయణ' (Ramayana). ఈ ఏడాది దీపావళి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో 'రామాయణ' ఇంగ్లిష్‌ వెర్షన్‌కు సంబంధించి ప్రస్తుతం నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది. హిందీ వెర్షన్‌తో పోలిస్తే ఇంగ్లిష్‌ వెర్షన్‌ నిడివి దాదాపు 30 నిమిషాలు తక్కువగా ఉండనుందని టాక్‌ వినిపిస్తోంది. విదేశీ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఇంగ్లిష్‌ వెర్షన్‌లో కొన్ని మార్పులు చేసినట్లు సమాచారం. అంతర్జాతీయంగా విడుదల చేయనున్న వెర్షన్‌లో ఒరిజినల్‌ పాటలు ఉండవని తెలుస్తోంది. అలాగే కొన్ని సన్నివేశాలను కూడా తొలగించినట్లు టాక్‌.

వివరాలు

అధికారిక ప్రకటన వెలువడలేదు

సాధారణంగా భారతీయ ప్రేక్షకులు మూడు గంటలకు పైగా నిడివి ఉన్న సినిమాలతో పాటు.. కథ మధ్యలో వచ్చే పాటలను కూడా ఆదరిస్తుంటారు.

అయితే అంతర్జాతీయ ప్రేక్షకులకు ఇలాంటి శైలి అంతగా నచ్చకపోవచ్చనే ఉద్దేశంతోనే నిర్మాతలు ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

అయితే 'రామాయణ' ఇంగ్లిష్‌ వెర్షన్‌ నిడివి, పాటలు, సన్నివేశాల తొలగింపునకు సంబంధించి చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇటీవల వినాయక చవితి సందర్భంగా 'రామాయణ'లోని తొలి పాట 'జయ జయ రామ్‌'ను విడుదల చేశారు.

వివరాలు

హనుమంతుడిగా సన్నీ దియోల్

ఈ పాట విశేషంగా ఆకట్టుకుంది. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించిన ఈ గీతాన్ని అర్జిత్‌ సింగ్‌, శ్రేయా ఘోషల్‌ ఆలపించారు.

ఈ సినిమాలో రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్‌ రావణుడిగా, సన్నీ దియోల్‌ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు.

నమిత్‌ మల్హోత్రా, యశ్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'రామాయణ- పార్ట్‌ 1' ఈ ఏడాది దీపావళికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ADVERTISEMENT