Page Loader
Shine Tom Chacko:సేలం-బెంగళూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. 'దసరా' విల్లన్ ఇంట విషాదం
'దసరా' విల్లన్ ఇంట విషాదం

Shine Tom Chacko:సేలం-బెంగళూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. 'దసరా' విల్లన్ ఇంట విషాదం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 06, 2025
10:05 am

ఈ వార్తాకథనం ఏంటి

మలయాళ నటుడు షైన్‌ టామ్‌ చాకో ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన కుటుంబం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం శుక్రవారం ఉదయం సేలం - బెంగళూరు జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో షైన్‌ టామ్‌ చాకో తండ్రి మృతి చెందినట్లు స్థానిక మీడియా నివేదికలు వెల్లడించాయి. ప్రమాదం సంభవించిన సమయంలో కారులో నటుడు షైన్‌తో పాటు ఆయన తల్లి కూడా ఉన్నారు. వారిద్దరికీ తీవ్రమైన గాయాలు కావడంతో వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియరాలేదు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

షైన్‌ టామ్‌ చాకో తండ్రి మృతి