మామా మశ్చీంద్ర టీజర్ రిలీజ్ డేట్: ప్రేక్షకులకు ఆఫర్ ఇచ్చిన దర్శకుడు హర్షవర్ధన్
ఈ వార్తాకథనం ఏంటి
సుధీర్ బాబు త్రిపాత్రాభినయంలో కనిపించనున్న మామా మశ్చీంద్ర సినిమా నుండి సరికొత్త అప్డేట్ వచ్చింది. మామా మశ్చీంద్ర టీజర్ ని విడుదల చేయడానికి చిత్రబృందం సిద్ధమైపోయారు.
ఈ మేరకు చిన్నపాటి వీడియోను రిలీజ్ చేసి, ఏప్రిల్ 14వ తేదీన టీజర్ విడుదల అవుతుందని ప్రకటించారు. ఈ వీడియోలో మరో విషయం కూడా చెప్పారు.
మామా మశ్చీంద్ర చిత్ర దర్శకుడు హర్షవర్ధన్ కు చాలామంది కాల్ చేసి మాయా మశ్చీంద్ర సినిమానా మీరు తీసింది అని అంటున్నారట. మాయా మశ్చీంద్ర కాదు, మామా మశ్చీంద్ర అని అందరికీ చెబుతూ వస్తున్నాడట.
ఈ నేపథ్యంలో మాయా మశ్చీంద్ర కాకుండా మామా మశ్చీంద్ర అని ఎందుకు పెట్టారో తెలుసుకోవాలని ఆడియన్స్ కు ఆఫర్ వదిలాడు.
మామా మశ్చీంద్ర
మొదటి 10మందికి పార్టీ ఉందంటున్న హర్షవర్ధన్
అందరికీ తెలిసిన, బాగా పాపులర్ అయిన మాయా మశ్చీంద్ర టైటిల్ కాకుండా మామా మశ్చీంద్ర టైటిల్ ఎందుకు పెట్టారో ఆడియన్స్ లోంచి ఎవరైనా గెస్ చేస్తే వాళ్ళకు పెద్ద పార్టీ ఉంటుందని హర్షవర్ధన్ తెలియజేసాడు.
గెస్ చేసిన మొదటి పది మందికి ఈ ఆఫర్ వర్తిస్తుందట. అది కూడా టీజర్ రిలీజ్ డేట్ ఏప్రిల్ 14వ తేదీ రోజునే గెస్ చేయాలట. మొత్తానికి ప్రేక్షకులకు పెద్ద పరీక్షే పెట్టాడు హర్షవర్ధన్.
ఈ సినిమాలో సుధీర్ బాబు ఊబకాయుడిగా ఒక పాత్రలో కనిపిస్తాడు. ఈ సినిమాలో హీరోయిన్లుగా ఈషా రెబ్బా, మృణాళిని రవి నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో హర్షవర్ధన్, అలీ రెజా, రాజీవ్ కనకాల, హరితేజ, అజయ్, మిర్చి కిరణ్ నటిస్తున్నారు.