Loading...
Mamitha Baiju: ఆస్పత్రిలో చేరిన మమితా బైజు.. అభిమానుల్లో ఆందోళన! అసలు ఏమైందంటే..
ఆస్పత్రిలో చేరిన మమితా బైజు.. అభిమానుల్లో ఆందోళన! అసలు ఏమైందంటే..

Mamitha Baiju: ఆస్పత్రిలో చేరిన మమితా బైజు.. అభిమానుల్లో ఆందోళన! అసలు ఏమైందంటే..

వ్రాసిన వారు Moogati Shabari
Sep 02, 2026
01:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

మలయాళ నటి మమితా బైజు ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా ఆమె ఆస్ట్రేలియా పర్యటన రద్దయినట్లు సమాచారం. అలాగే మెల్‌బోర్న్‌లో జరగాల్సిన ఓనం వేడుకలను కూడా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. మెల్‌బోర్న్‌లో నిర్వహించనున్న Clyde Onam 2026 వేడుకలకు మమితా బైజు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉండగా.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆ పర్యటనను రద్దు చేసుకున్నట్లు సమాచారం. దీంతో మమితా పాల్గొనాల్సిన ఓనం వేడుకను నిర్వాహకులు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

వివరాలు

వైద్యుల సలహాలను పాటిస్తూ విశ్రాంతి..

మమితా ప్రస్తుతం వైద్యుల సలహాలను పాటిస్తూ విశ్రాంతి తీసుకుంటున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు వెల్లడించినట్లు సమాచారం.

ఇటీవల ఆమె నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మమితా ఆస్పత్రిలో చేరిన విషయం తెలియడంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఆమెకు ఎదురైన అనారోగ్య సమస్య ఏమిటనే దానిపై ఇప్పటివరకు పూర్తి వివరాలు వెల్లడికాలేదు.

అలాగే ఆమె ఎంతకాలం ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుందనే విషయంపై కూడా ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

వివరాలు

త్వరగా కోలుకోవాలని అభిమానుల ఆకాంక్ష..

ప్రస్తుతం వైద్యుల సూచనల మేరకు ఆమె విశ్రాంతి తీసుకుంటున్నట్లు మాత్రమే తెలుస్తోంది.

మమితా త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.

ఆమె ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత ఆస్ట్రేలియాలో వాయిదా పడిన ఓనం వేడుకకు కొత్త తేదీని నిర్వాహకులు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ADVERTISEMENT