LOADING...
Manchu Manoj: 'డేవిడ్ రెడ్డి'గా మంచు మనోజ్‌..అదిరిపోయిన కొత్త చిత్రం పోస్టర్ 
'డేవిడ్ రెడ్డి'గా మంచు మనోజ్‌..అదిరిపోయిన కొత్త చిత్రం పోస్టర్

Manchu Manoj: 'డేవిడ్ రెడ్డి'గా మంచు మనోజ్‌..అదిరిపోయిన కొత్త చిత్రం పోస్టర్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 06, 2025
11:27 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పటికే 21 సంవత్సరాలు పూర్తయినట్లు మంచు మనోజ్‌ తెలిపారు. ఈ ఏడాది ప్రస్థానం మొత్తం తనకు ఎంతో విలువైనదిగా భావిస్తున్నట్టు చెప్పారు.ఇన్నేళ్లుగా తనను ఆదరిస్తూ, అప్రతిహతంగా ప్రేమ చూపిస్తున్న అభిమానులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని తన 21వసినిమాను అధికారికంగా ప్రకటించారు. ఇలాంటి అభిమానాన్ని పొందడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తన 21వ చిత్రం పేరు'డేవిడ్‌ రెడ్డి'అని వెల్లడించారు. ఇది ఒక హిస్టారికల్‌ యాక్షన్‌ చిత్రంగా తెరకెక్కనుందని స్పష్టంచేశారు. దర్శకుడు హనుమరెడ్డి యక్కంటి సారథ్యంలో ఈ సినిమా 1897 నుంచి 1922 మధ్య కాలంలో చోటుచేసుకున్న వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడించనున్నట్లు చెప్పారు.

వివరాలు 

'భైరవం' చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు..

మంచు మనోజ్‌ చిన్నప్పుడే చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. 'మేజర్‌ చంద్రకాంత్‌' సినిమాలో బాలనటుడిగా ఆయన నటించారు. తర్వాత 'దొంగ దొంగది' సినిమాతో హీరోగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. కొంతకాలంగా సినీ రంగానికి విరామం తీసుకున్న మనోజ్‌, ఇటీవల 'భైరవం' చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అందులో గజపతి వర్మగా ఆలయ భూములు, నగలు రక్షించే పాత్రలో నటించి మంచి ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమా ద్వారా నటుడిగా తనకు పునర్జన్మ లభించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం మనోజ్‌ 'మిరాయ్‌','వాట్‌ ది ఫిష్‌' అనే చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులపై కూడా అభిమానులలో మంచి ఆసక్తి నెలకొంది.