Page Loader
Mohan Babu: సినీనటుడు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో ఊరట
Mohan Babu: సినీనటుడు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో ఊరట

Mohan Babu: సినీనటుడు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో ఊరట

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 09, 2025
12:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

సినీనటుడు, దర్శకుడు, నిర్మాత మంచు మోహన్‌బాబు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనపై జరుగుతున్న విచారణలు, ముందస్తు బెయిల్ పై సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చాయి. మోహన్‌బాబును అరెస్టు చేయవద్దని, విచారణ పూర్తి అయ్యేంతవరకు ఆయనకు అరెస్ట్ లేకుండా ఉండాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. తెలంగాణ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయకుండా నిరాకరించింది. ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ, ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

వివరాలు 

మోహన్‌బాబుదాడి చేయడం వల్ల జర్నలిస్టుకు తీవ్ర గాయాలు

గత గురువారం, సుప్రీం కోర్టు విచారణ అనంతరం, ముందస్తు బెయిల్ పై తీర్పును ఇవ్వగా, మోహన్‌బాబును అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీచేసింది. 78 ఏళ్ల వయస్సు, గుండె సంబంధిత వ్యాధి కారణంగా, మోహన్‌బాబు తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో,ఆయన సుప్రీంకోర్టు నుండి సానుకూల తీర్పు ఆశిస్తున్నట్లు తెలిపారు. మోహన్‌బాబుదాడి చేయడం వల్ల జర్నలిస్టుకు తీవ్ర గాయాలు కలిగాయి. ఈ క్రమంలో, హత్యాయత్నం, కోర్టు ఆదేశాల ఉల్లంఘనపై కేసులు నమోదయ్యాయి. గత నెల డిసెంబర్ 24న, కోర్టు ఆదేశాలతో ఆయన పోలీసుల ముందు హాజరుకావాలని సూచించింది. అయితే, ఆ ఆదేశాలను ఆయన పాటించకపోవడంతో హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ నిరాకరించింది. దీంతో, ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.