Page Loader
ఆర్ ఎక్స్ 100 కాంబినేషన్ రిపీట్: సెగలు పుట్టిస్తున్న  పాయల్ రాజ్ పుత్ ఫస్ట్ లుక్ 
మంగళవారం సినిమా నుండి పాయల్ ఫస్ట్ లుక్

ఆర్ ఎక్స్ 100 కాంబినేషన్ రిపీట్: సెగలు పుట్టిస్తున్న  పాయల్ రాజ్ పుత్ ఫస్ట్ లుక్ 

వ్రాసిన వారు Sriram Pranateja
Apr 25, 2023
12:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్ ఎక్స్ 100 సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి, ఆ తర్వాత మహాసముద్రం సినిమాతో అపజయాన్ని మూటగట్టుకున్నాడు. తాజాగా మంగళవారం అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం మంగళవారం లోంచి పాయల్ రాజ్ పుత్ ఫస్ట్ లుక్ రిలీజైంది. ఈ ఫస్ట్ లుక్ లో ఒంటిపై ఏమీ లేకుండా వీపుభాగాన్ని ఎక్స్ పోజ్ చేస్తూ పాయల్ రాజ్ పుత్ కనిపించింది. ఈ సినిమాలో పాయల్ పాత్రపేరు శైలజ అని, శైలుగా ప్రేక్షకుల మదిలోనిలిచిపోతుందని దర్శకుడు అన్నాడు. దక్శిణాది భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రానికి కాంతారా ఫేమ్, అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మంగళవారం సినిమా నుండి పాయల్ ఫస్ట్ లుక్