Loading...
Geethanjali Re Release Date: రీ రిలీజ్‌కు సిద్ధమైన 'గీతాంజలి'.. నవంబర్ 13న మరోసారి వెండితెరపై మేజిక్!
రీ రిలీజ్‌కు సిద్ధమైన 'గీతాంజలి'.. నవంబర్ 13న మరోసారి వెండితెరపై మేజిక్!

Geethanjali Re Release Date: రీ రిలీజ్‌కు సిద్ధమైన 'గీతాంజలి'.. నవంబర్ 13న మరోసారి వెండితెరపై మేజిక్!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 01, 2026
12:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రేమకథా చిత్రాల్లో 'గీతాంజలి' (Geethanjali)కి ప్రత్యేక స్థానం ఉంది. నాగార్జున కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఆయన సినీ ప్రయాణంలోనే బ్లాక్‌బస్టర్‌ విజయంగా నిలిచింది. ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ క్లాసిక్‌ లవ్‌స్టోరీ మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. 'గీతాంజలి'ని నవంబర్‌ 13న రీరిలీజ్‌ చేయనున్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడిస్తూ.. 'మరోసారి ఆ మేజిక్‌ను చూసేందుకు సిద్ధంగా ఉండండి' అంటూ సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. దీంతో నాగార్జున అభిమానులతో పాటు పాతతరం ప్రేక్షకులు, క్లాసిక్‌ సినిమాలను ఇష్టపడేవారిలోనూ ఈ రీరిలీజ్‌పై అంచనాలు పెరిగాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మరోసారి వెండితెరపైకి గిరిజ, నాగార్జునల ప్రేమకథ 'గీతాంజలి'

వివరాలు 

ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన దర్శకుడు, హీరోయిన్ 

అగ్ర దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన తొలి తెలుగు చిత్రం 'గీతాంజలి'.

ఈ సినిమాతోనే గిరిజ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. నాగార్జునకు జోడీగా ఆమె అల్లరి, అమాయకత్వంతో కూడిన పాత్రలో ఆకట్టుకున్నారు.

సాధారణ ప్రేమకథకు భిన్నంగా.. జీవితానికి తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉన్న ఇద్దరు ప్రేమికుల మధ్య ఏర్పడిన అనుబంధాన్ని మణిరత్నం ఎంతో సున్నితంగా, భావోద్వేగభరితంగా తెరపై ఆవిష్కరించారు.

సినిమా కథతో పాటు 'గీతాంజలి' పాటలు కూడా అప్పట్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇళయరాజా అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

సినిమాలోని ప్రతి పాట ప్రత్యేకమైన ఆదరణను సొంతం చేసుకోవడంతో పాటు ఇప్పటికీ సంగీత ప్రియుల ప్లేలిస్టుల్లో వినిపిస్తూనే ఉన్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

సినీ అభిమానుల్లో ఉత్సాహం

కథ, నటన, సంగీతం, దర్శకత్వం.. ఇలా అన్ని అంశాల్లోనూ ప్రత్యేకతను చాటుకున్న ఈ చిత్రం కాలం గడిచినా తన క్రేజ్‌ను కోల్పోలేదు.

ప్రస్తుతం పాత సూపర్‌హిట్‌ చిత్రాలను మళ్లీ థియేటర్లలోకి తీసుకొస్తున్న రీరిలీజ్‌ల ట్రెండ్‌ కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో 'గీతాంజలి' కూడా మరోసారి పెద్ద తెరపైకి వస్తుండటంతో సినీ అభిమానుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.

అప్పట్లో థియేటర్లలో ఈ సినిమాను ఆస్వాదించిన ప్రేక్షకులతో పాటు.. కొత్తతరం ప్రేక్షకులు కూడా ఈ క్లాసిక్‌ ప్రేమకథను వెండితెరపై చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ADVERTISEMENT