LOADING...
Lenin Teaser: 'మనోడు వస్తున్నాడు'.. అఖిల్ 'లెనిన్' టీజర్ రిలీజ్!

Lenin Teaser: 'మనోడు వస్తున్నాడు'.. అఖిల్ 'లెనిన్' టీజర్ రిలీజ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 23, 2026
12:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

అక్కినేని అఖిల్ హీరోగా, దర్శకుడు మురళీకిశోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'లెనిన్'. ఇందులో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నాగార్జున సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, చిత్రబృందం నేడు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది.

వివరాలు

ప్రత్యేక ఆకర్షణగా డైలాగ్స్

టీజర్‌లో అఖిల్ చెప్పిన డైలాగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. "మనోడు వస్తున్నాడు..", "నేను తప్పిపోయి రాలేదు.. మీ అందరినీ వెతుక్కుంటూ వచ్చా" అంటూ ఆయన చెప్పిన డైలాగులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. టీజర్‌ను షేర్ చేసిన నాగార్జున, "నాకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు" అంటూ స్పందించారు. టీజర్ మొత్తం చూస్తున్నంతసేపు ఎంతో హాయిగా అనిపించిందని ఆయన పేర్కొన్నారు.

Advertisement