Page Loader
Kalki 2898AD : 35శాతం షూటింగ్‌ కంప్లీట్‌ కంప్లీట్ చేసుకున్న 'కల్కి 2898 AD'
35శాతం షూటింగ్‌ కంప్లీట్‌ కంప్లీట్ చేసుకున్న 'కల్కి 2898 AD'

Kalki 2898AD : 35శాతం షూటింగ్‌ కంప్లీట్‌ కంప్లీట్ చేసుకున్న 'కల్కి 2898 AD'

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2024
09:31 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా సుమారు 12వందల కోట్ల రూపాయల భారీ వసూళ్లను సాధించిన 'కల్కి 2898 AD' ప్రభాస్‌ కెరీర్‌లో, 'బాహుబలి' ఫ్రాంచైజీ తర్వాతి స్థానాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌పై ఆసక్తి దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్లో పెరుగుతోంది. ఎట్టకేలకు, చిత్ర నిర్మాతలు స్వప్న దత్‌, ప్రియాంక దత్‌ తాజాగా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో 'కల్కి 2' గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

వివరాలు 

స్క్రిప్ట్‌లో అవసరం అనిపిస్తే కొన్ని మార్పులు

''ఈ సినిమా ప్రీప్రొడక్షన్‌ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. కానీ, రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం గురించి క్లారిటీ మాత్రం ఇంకా లేదు. త్వరలోనే అన్ని వివరాలను ప్రకటిస్తాము. నిజానికి, 'కల్కి 2898ఏడీ' చిత్రీకరణ సమయంలోనే సీక్వెల్‌కు కొంతమేర షూటింగ్‌ జరిగింది.దాదాపు 35శాతం పనులు పూర్తి అయ్యాయి. స్క్రిప్ట్‌లో అవసరం అనిపిస్తే కొన్ని మార్పులు చేస్తాం, లేదంటే ప్రస్తుత కథాంశంతోనే కొనసాగుతాం,'' అన్నారు. అలాగే,'కల్కి 2' గురించి మరిన్ని వివరాలు తెలియజేస్తూ,''మొదటి భాగంలో ముఖ్యపాత్రలో నటించిన దీపికా పదుకొణే, రెండో భాగంలో కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో కనిపిస్తారు.అమితాబ్‌ బచ్చన్‌,ప్రభాస్‌ పాత్రలు ఈ సీక్వెల్‌లో మరింత ప్రభావవంతంగా ఉంటాయి.అదనంగా, ఎన్నో అద్భుతమైన విజువల్స్‌ ఈ రెండో భాగంలో కనిపిస్తాయి,''అని స్వప్న దత్‌, ప్రియాంక దత్‌ వివరించారు.

వివరాలు 

త్వరలోనే షూటింగ్‌ సంబంధిత సమాచారం

ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పరచుకున్న 'కల్కి 2' చిత్రంపై మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. త్వరలోనే షూటింగ్‌ సంబంధిత సమాచారం రాబోతోందని చిత్ర బృందం తెలిపింది.