
బాలీవుడ్ లో పాగా వేయబోతున్న తెలుగు సంగీత దర్శకుడు: అంతా 8AM మెట్రో వల్లే
ఈ వార్తాకథనం ఏంటి
మార్క్ కె రాబిన్.. మళ్ళీ కలుద్దాం అనే షార్ట్ ఫిలిమ్ కు సంగీతం అందించి 2017లో సైమా అవార్డు గెలుచుకున్నాడు. ఆ తర్వాత డైలీ బైలీ షార్ట్ ఫిలిమ్ కు స్వరాలు సమకూర్చాడు.
డైలాగ్ ఇన్ ద డార్క్ అనే షార్ట్ ఫిలిమ్ కు మార్క్ అందించిన సంగీతానికి మంచి పేరొచ్చింది. ఆ తర్వాత మొదటిసారిగా అ! సినిమాలో మార్క్ కె రాబిన్ కు అవకాశం వచ్చింది. ఈ రెండు ప్రాజెక్టులకు ప్రశాంత్ వర్మ దర్శకుడు కావడం చెప్పుకోవాల్సిన విషయం.
అ! ఇచ్చిన సక్సెస్ తో సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చాయి. మల్లేశం, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాంబీ రెడ్డి సినిమాలకు మ్యూజిక్ అందించాడు మార్క్.
Details
బాలీవుడ్ జనాలను ఆకట్టుకుంటున్న వో ఖుదా పాట
పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన లైగర్ సినిమాలోని వాట్ లగా దేంగే పాటను కంపోజ్ చేసింది మార్క్ కావడం విశేషం.
తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్న మార్క్, 8AM మెట్రో సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టాడు. ఈ సినిమాను మల్లేశం దర్శకుడు రాజ్ ఆర్ తెరకెక్కించారు.
అయితే ఈ సినిమాలోని వో ఖుదా అనే పాట బాలీవుడ్ జనాలకు బాగా ఆకట్టుకుంటోంది. ఈ పాటను నూరన్ సిస్టర్స్ అద్భుతంగా పాడారు.
ఈ పాట కారణంగా మార్క్ కె రాబిన్ కు బాలీవుడ్ నుండి అవకాశాలు వస్తున్నాయట. ఇప్పటికే చాలామంది నిర్మాతలు మార్క్ ని సంప్రదించారని టాక్.
మరి ఆ అవకాశాలను ఉపయోగించుకుని బాలీవుడ్ లో సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి.