
Taapsee Pannu: 2023 డిసెంబర్‌లోనే పెళ్లి అయింది.. తాప్సీ సంచలన ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
నటి తాప్సీ పన్ను తాజాగా తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
అందరూ అనుకుంటున్నట్లు ఈ ఏడాది కాదు, గతేడాదే తన వివాహం జరిగిందని తెలిపారు.
ఓ ఆంగ్ల వెబ్‌సైట్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ విషయాన్ని పంచుకున్నారు.
గతేడాది డిసెంబర్‌లో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని, ఈ డిసెంబర్‌లో తమ పెళ్లి వార్షికోత్సవం జరుపుకుంటున్నామని చెప్పారు.
ఈ విషయాన్ని తాను బయటపెట్టకుంటే ఎవరికి దీని గురించి తెలియదని, వ్యక్తిగత జీవితాన్ని చాలా ప్రైవేట్‌గా ఉంచడమే తమకు ఇష్టమన్నారు.
పర్సనల్ లైఫ్‌ను పబ్లిక్ చేస్తే వృత్తిపరమైన విషయాలకు అది ఆటంకంగా మారుతుందని భావించామన్నారు. ఆ కారణంగా పెద్దగా ఏదీ చెప్పలేదన్నారు.
Details
ఉదయ్ పుర్ లో పెళ్లి
తమ పెళ్లి అనంతరం ఉదయ్‌పుర్‌లో సంప్రదాయబద్ధంగా ఆత్మీయులు, సన్నిహితుల కోసం ఒక చిన్న వేడుక చేశామని, కానీ దానిని బహిరంగంగా ప్రకటించలేదని ఆమె తెలిపింది.
తాప్సీ దాదాపు పదేళ్లుగా డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో ప్రేమలో ఉంది. సౌత్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్‌కు మారిన తొలి రోజుల్లోనే అతడితో పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం ప్రేమగా మారిందన్నారు.
ఇరు కుటుంబాల అంగీకారంతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టామని తాప్సీ గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఈ ఏడాది మార్చి 23న ఉదయ్‌పుర్‌లో వారి సంప్రదాయబద్ధమైన పెళ్లి జరిగింది. ఈ వేడుకకు ఆత్మీయులు మాత్రమే హాజరయ్యారు.
Details
పెళ్లి పోటోలు షేర్ చేయలేదు
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారినా, తాప్సీ పన్ను తాను పెళ్లి ఫొటోలు అధికారికంగా షేర్ చేయలేదు.
పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువగా పబ్లిక్ చేయడం వల్ల ఆ ఒత్తిడి వృత్తిపరమైన జీవితంపై పడుతుందని తాము భావించామని తాప్సీ అన్నారు.
తాప్సీ తాను తన వ్యక్తిగత విషయాలను పబ్లిక్ చేయడం ఇష్టపడని కారణంగా ఈ వివాహాన్ని చాలామంది సీక్రెట్ మ్యారేజ్‌గా అనుకున్నారు. కానీ తాప్సీ ఇప్పుడు ఈ విషయాన్ని బయటపెట్టారు.
తమ జీవితం కోసం సరైన బ్యాలెన్స్ కావాలి. అందుకే మా నిర్ణయాలను మా వరకు మాత్రమే పరిమితం చేసుకున్నామని ఆమె చెప్పారు.