LOADING...
Vasudheva Sutham: 'వసుదేవసుతం' నుంచి 'ఆనందాల వేళ' పాట విడుదల..

Vasudheva Sutham: 'వసుదేవసుతం' నుంచి 'ఆనందాల వేళ' పాట విడుదల..

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 06, 2026
10:38 am

ఈ వార్తాకథనం ఏంటి

మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'వసుదేవసుతం' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. రెయిన్‌బో సినిమాస్ బ్యానర్‌పై ధనలక్ష్మి బాదర్ల నిర్మిస్తున్న ఈ చిత్రానికి వైకుంఠ్ బోను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి గ్లింప్స్, టీజర్, ట్రైలర్‌తో పాటు పలువురు ప్రేక్షకులను ఆకట్టుకున్న పాటలను విడుదల చేసిన చిత్రబృందం, తాజాగా మరో కొత్త పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.

వివరాలు 

సంగీత దర్శకుడిగా  మణిశర్మ

'ఆనందాల వేళ..' అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్‌ను హీరో ఆది విడుదల చేశారు. పాటను ఆవిష్కరించిన అనంతరం లిరికల్ వీడియోను వీక్షించిన ఆయన చిత్రబృందాన్ని అభినందిస్తూ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ పాటకు ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ స్వరాలు సమకూర్చగా, సాహిత్యాన్ని చైతన్య ప్రసాద్ అందించారు. సాయి చరణ్ భాస్కరుణి, శృతిక సముద్రాల ఈ గీతాన్ని ఆలపించారు. హోలీ పండుగ నేపథ్యంతో రూపొందిన ఈ పాటలో కుటుంబ అనుబంధాలు, ప్రేమ భావోద్వేగాలను అందంగా ఆవిష్కరించారు. మధురమైన స్వరాలు, ఆకట్టుకునే విజువల్స్‌తో రూపొందిన 'ఆనందాల వేళ' పాట ప్రేక్షకులను అలరిస్తోంది.

Advertisement