Loading...
Emmy Awards 2026: ఎమ్మీ అవార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన మాథ్యూ రైస్‌, జీన్‌ స్మార్ట్‌!
ఎమ్మీ అవార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన మాథ్యూ రైస్‌, జీన్‌ స్మార్ట్‌!

Emmy Awards 2026: ఎమ్మీ అవార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన మాథ్యూ రైస్‌, జీన్‌ స్మార్ట్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 15, 2026
01:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

లాస్‌ఎంజెల్స్‌లోని పీకాక్‌ థియేటర్‌లో 78వ ప్రైమ్‌టైమ్‌ ఎమ్మీ అవార్డ్స్‌ (78th Primetime Emmy Awards) వేడుక అత్యంత వైభవంగా ముగిసింది. ఈ ఏడాది అవార్డుల రేసులో సరికొత్త రికార్డులు, చారిత్రాత్మక విజయాలు టెలివిజన్‌ ప్రపంచాన్ని షేక్‌ చేశాయి. ప్రముఖ నటి మార్స్కా హర్గిటే హోస్ట్‌గా వ్యవహరించిన ఈ వేడుకలో సరికొత్త హారర్‌ కామెడీ సిరీస్‌ 'విడోస్‌ బే' (Widow's Bay), మెడికల్‌ డ్రామా 'ది పిట్‌' (The Pitt) ప్రధాన కేటగిరీల్లో సత్తా చాటాయి.

వివరాలు

14 ఎమ్మీలు.. 'విడోస్‌ బే' సరికొత్త రికార్డు

ఈసారి ఎమ్మీ వేదికపై ఆపిల్‌ టీవీ ప్లస్‌ హారర్‌ కామెడీ సిరీస్‌ 'విడోస్‌ బే' ఏకంగా 14 ఎమ్మీ అవార్డులను గెలుచుకుంది.

దీంతో ఒకే సీజన్‌లో అత్యధిక అవార్డులు సాధించిన కామెడీ సిరీస్‌గా ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించింది.

అంతేకాదు.. బెస్ట్‌ కామెడీ సిరీస్‌ అవార్డును కూడా 'విడోస్‌ బే' కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో హీరోగా నటించిన మ్యాథ్యూ రిస్‌(Matthew Rhys)కూడా చరిత్ర సృష్టించారు.

ఒకే రాత్రి రెండు వేర్వేరు లీడ్‌ యాక్టర్‌ కేటగిరీల్లో అవార్డులు గెలుచుకున్న ఏకైక నటుడిగా రికార్డులకెక్కారు.

'విడోస్‌ బే'కు గాను బెస్ట్‌ కామెడీ యాక్టర్‌, 'ది బీస్ట్‌ ఇన్‌ మీ'(The Beast in Me)కి గాను బెస్ట్‌ లిమిటెడ్‌ సిరీస్‌ యాక్టర్‌ అవార్డులను ఒకే రాత్రి అందుకున్నారు.

వివరాలు

జీన్‌ స్మార్ట్‌ మరో అరుదైన ఘనత

లెజెండరీ నటి జీన్‌ స్మార్ట్‌ (Jean Smart) కూడా ఎమ్మీ అవార్డ్స్‌లో సరికొత్త రికార్డు సృష్టించారు.

'హ్యాక్స్‌' (Hacks) సిరీస్‌ ఐదో సీజన్‌కు గాను ఆమె వరుసగా ఐదోసారి బెస్ట్‌ కామెడీ యాక్ట్రెస్‌ అవార్డును దక్కించుకున్నారు.

దీంతో ఈ విభాగంలో వరుసగా ఐదుసార్లు అవార్డు గెలుచుకున్న ఘనతను సొంతం చేసుకున్నారు.

ADVERTISEMENT

వివరాలు

'ది పిట్‌'కు వరుసగా రెండోసారి బెస్ట్‌ డ్రామా

మరోవైపు అత్యధికంగా 25 నామినేషన్లతో ఈ ఏడాది ఎమ్మీ అవార్డుల బరిలోకి దిగిన హెచ్‌బీఓ మ్యాక్స్‌ మెడికల్‌ థ్రిల్లర్‌ 'ది పిట్‌' మరోసారి తన సత్తా చాటింది.

వరుసగా రెండో ఏడాది బెస్ట్‌ డ్రామా సిరీస్‌ ట్రోఫీని గెలుచుకుంది.

ఇందులో నటించిన నోవా వైల్‌ (Noah Wyle) బెస్ట్‌ డ్రామా యాక్టర్‌ అవార్డును అందుకున్నారు.

ADVERTISEMENT

వివరాలు

లిమిటెడ్‌ సిరీస్‌లో 'డీటీఎఫ్‌ సెయింట్‌ లూయిస్‌' విజయం

లిమిటెడ్‌ సిరీస్‌ కేటగిరీలో 'డీటీఎఫ్‌ సెయింట్‌ లూయిస్‌' (DTF St. Louis) బెస్ట్‌ సిరీస్‌గా నిలిచింది.

మరోవైపు ట్విస్టీ సైన్స్‌-ఫిక్షన్‌ డ్రామా 'ప్లూరిబస్‌' (Pluribus)లో అద్భుతమైన నటనకు గాను రియా సీహోర్న్‌ (Rhea Seehorn) బెస్ట్‌ డ్రామా యాక్ట్రెస్‌ అవార్డును సొంతం చేసుకున్నారు.

హాలీవుడ్‌ టెలివిజన్‌ చరిత్రలో ప్రత్యేకంగా..

మొత్తంగా చూస్తే.. 2026 ఎమ్మీ అవార్డ్స్‌లో 'విడోస్‌ బే' రికార్డు స్థాయి విజయంతో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

మరోవైపు 'ది పిట్‌' వరుసగా రెండోసారి బెస్ట్‌ డ్రామా సిరీస్‌ అవార్డును గెలుచుకుని తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. మ్యాథ్యూ రిస్‌, జీన్‌ స్మార్ట్‌ చరిత్ర సృష్టించడంతో ఈ ఏడాది ఎమ్మీ వేడుక హాలీవుడ్‌ టెలివిజన్‌ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయింది.

ADVERTISEMENT