పెళ్ళితో కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్న మేఘా ఆకాష్: వరుడు ఎవరంటే?
తెలుగు సినిమా పరిశ్రమలో వరుసగా పెళ్ళిళ్ళ సందడి వినిపిస్తోంది. మొన్నటికి మొన్న హీరో శర్వానంద్, రక్షిత రెడ్డిని వివాహం చేసుకున్నాడు. మెగా హీరో వరుణ్ తేజ్ కూడా పెళ్ళి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా హీరోయిన్ మేఘా ఆకాష్, పెళ్ళి చేసుకోబోతుందని సమాచారం. తమిళనాడుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడి వారసుడితో జీవితం పంచుకుని కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతుందని అంటున్నారు. ఈ విషయమై అధికారిక సమాచారం ఇంకా రాలేదు. ఇది లవ్ మ్యారేజ్ అనీ, పెద్దలు కూడా ఒప్పుకున్నారని తెలుస్తోంది. మరి పెళ్ళి వేడుక ఎప్పుడు ఉంటుంది? మొదలైన విషయాలు వెల్లడి కావాల్సి ఉంది.
సక్సెస్ కు చాలా దూరంలో నిలిచిన మేఘా ఆకాష్
నితిన్ హీరోగా రూపొందిన లై సినిమాతో తెలుగులో మేఘా ఆకాష్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాకు ప్రేక్షకుల నుండి సరైన స్పందన రాలేదు. మొదటి సినిమా ఫ్లాప్ తర్వాత డియర్ మేఘ, ఛల్ మోహనరంగ, గుర్తుందా శీతాకాలం మొదలైన సినిమాల్లో నటించింది. వీటిల్లో ఏ సినిమా కూడా సక్సెస్ ని ఇవ్వలేకపోయాయి. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. హిందీలో సల్మాన్ ఖాన్ నటించిన రాధే సినిమాలో కనిపించింది. ఇటీవల మేఘా ఆకాష్ కనిపించిన చిత్రం రావణాసుర. రవితేజ హీరోగా రూపొందిన ఈ సినిమా, నెగెటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో మనుచరిత్ర, మజై పిడికత మనితన్ సినిమాలున్నాయి మరి ఈ సినిమాలతోనైనా హిట్ అందుకుంటుందేమో చూడాలి.