
చంద్రముఖి 2 సినిమాలో పది పాటలు: సర్ప్రైజ్ చేసిన కీరవాణి
ఈ వార్తాకథనం ఏంటి
రాఘవ లారెన్స్ హీరోగా చంద్రముఖి సినిమా సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. చంద్రముఖి 2 చిత్రబృందం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా ఉంది.
తాజాగా చంద్రముఖి 2 పాటల గురించి సంగీత దర్శకుడు కీరవాణి ఖతర్నాక్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో మొత్తం 10పాటలున్నాయట. అన్నింటినీ పూర్తి చేసేసాననీ, ఈరోజే చివరి వర్కింగ్ డే అని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసారు.
ప్రస్తుతానికి చంద్రముఖి 2 నుండి స్వాగతాంజలి పాట రిలీజైంది. ఈ పాటకు అన్ని భాషల్లో మంచి వ్యూస్ దక్కాయి.
లైకా ప్రొడక్షన్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాను పి వాసు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్, వడివేలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సంగీత దర్శకుడు కీరవాణి ట్వీట్
Last working day for Chandramukhi 2. It has been a memorable journey with
— mmkeeravaani (@mmkeeravaani) August 16, 2023
P Vasu Sir , @offl_Lawrence and @LycaProductions. Looking forward to releasing the remaining 9 songs !